సూర్య తాపంతో హీటెక్కిన అరుగుపై ఆమ్లెట్ (వీడియో)

Woman Cooks Omelette On Floor in Telangana

01:07 PM ON 16th April, 2016 By Mirchi Vilas

Woman Cooks Omelette On Floor in Telangana

వేసవి తాపం అంతా ఇంతా కాదు ... ప్రచండ భానుడి భగ భగ లు జనాన్ని ఠారెత్తిస్తున్నాయి, తెలుగురాష్ర్టాల్లో భానుడు విజృంభణకు ఎప్పుడూలేని విధంగా గరిష్ట స్థాయిలో ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ వేడికి తాళలేక సామాన్యులు పిట్టల్లా రాలిపోతున్నారు.ఉదయం 9 అయితే చాలు.. రోడ్లపై కాలు పెట్టడానికి బెంబేలెత్తుతున్నారు. సాయంత్రం 5 దాటినా బయటకు రాలేని స్థితి నెలకొంది. ఇక వృద్ధులు, చిన్నపిల్లులు ఇంట్లోనుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. సాయంత్రం ఆరుగంటలైనా అదే వేడి.. రాత్రయితే ఇంట్లో ఒకటే ఉక్కుపోత. ఇక ఈ వేడి ఎంత దారుణంగా వుందో చెప్పడానికి తెలంగాణాలో ఈ ఎగ్జాంఫుల్ చూస్తే, ఇక ప్రత్యేకంగా చెప్పే పరిస్థితి అక్కర్లేదు. ఇంతకీ విషయం ఏమంటే, కరీంనగర్‌లో ఇంటి ముందు అరుగుపై ఓ మహిళ ఆమ్లెట్ వేసేసింది. ఇంటి అరుగుపై ఆమ్లెట్.. ఇదేదో తమాషా కాదు ... ఇంటి ముందు ఫ్లోర్‌పై ఇలా ఆమ్లెట్ వేసి అందర్నిఆ మహిళ ఆశ్చర్యపరిచింది. అంటే ఆ అరుగు సూర్యతాపానికి పెనం లా మారిందన్న మాట. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేసేస్తోంది. మరి మనం ఓ లుక్కేద్దాం.

ఇవి కూడా చదవండి:

పవర్ స్టార్ కి బీర్లతో అభిషేకం!

ఊపిరిలో పెయింటింగ్ అఖిల్ దా.. తమన్నా దా..

సుమ భర్తతో రష్మి సరసాలు

English summary

A Woman in Telangana State cooks Omelette on the hot floor of her house. This was recorded and uploaded in Youtube now this video was going viral over the internet.