కాబ్‌లో ప్రసవం...పసివాడి పేరు ఉబెర్‌ 

Woman Delivers Baby In Cab

01:52 PM ON 12th December, 2015 By Mirchi Vilas

Woman Delivers Baby In Cab

ఆ మహిళకు ప్రసవవేదన ఎక్కువైంది...డజన్ల కొలదీ కాల్స్‌ చేసినప్పటికీ అంబులెన్స్‌ జాడ ఏమాత్రం కనిపించడం లేదు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆసుపత్రికి చేరేందుకు క్యాబ్‌ను పిలిపించారు. కానీ ఆ క్యాబ్‌లోనే ఆ మహిళ ప్రసవించింది. పండంటి మగబిడ్డను కన్నది. ఆ పుట్టిన బిడ్డకు ముద్దుగా ఉబెర్‌ అని పేరుపెట్టుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ సంఘటన వివరాల్లోకెళితే... బాబ్లీ అనే మహిళ గురువారం రాత్రి పురిటి నొప్పులు ప్రారంభం కావడంతో ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్ళాల్సిందిగా, ఉబెర్‌ కాబ్‌కు కాల్‌ చేసింది. ఆ కాల్‌ను రిసీవ్‌ చేసుకున్న ఉబెర్‌కాబ్‌ డ్రైవర్‌ షాహనవాజ్‌ అసలు విషయం కనుక్కుని తాను డెలివరీ కోసం కాబ్‌ను తీసుకురాలేనని బదులిచ్చాడు. ఏదైనా అంబులెన్స్‌ను పిలవాల్సిందిగా సూచనలు కూడా ఇచ్చాడు. కానీ అప్పటికే అంబులెన్స్‌లు రాకపోవడంతో ఉబెర్‌ కాబ్‌ను సంప్రదించినట్లు చెప్పిన బాబ్లీ, త్వరగా క్యాబ్‌ను తీసుకురావాల్సిందిగా కోరింది. దీంతో బాబ్లీను మరో ముగ్గురు మహిళలను క్యాబ్‌లో ఎక్కించుకుని ఆసుపత్రికి పయనమయ్యాడు. కానీ అప్పటికీ సమయం మించిపోవడంతో నొప్పులు మరింత పెరిగిపోవడంతో ఏమి చేయాలో పాలుపోలేదు. ఇక క్యాబ్‌ను ప్రసూతి గదిగా మార్చేసి కారులోనే ప్రసవం చేసారు. ఇలా అనుకోని పరిస్థితుల్లో తన క్యాబ్‌లో ఒక కొత్త ప్రాణం ఊపిరిపోసుకోవడం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని క్యాబ్‌ డ్రైవర్‌ ఆనందంగా ఉన్నాడు. తన బాబుకు ప్రాణాన్నిచ్చిన క్యాబ్‌ కంపెనీ ఉబెర్‌ పేరునే బాబ్లీ తన బిడ్డకు పెట్టుకుని మురిసిపోతుంది.

English summary

A pregnant woman gives birth to a baby boy in uber cab. After they named that baby boy as Uber