మహిళా ఇంజనీర్ సజీవ దహనం.. అంతకుముందు రేప్?!

Woman engineer raped and killed brutally

04:36 PM ON 25th October, 2016 By Mirchi Vilas

Woman engineer raped and killed brutally

ఆడవాళ్లపై దారుణాలు పెచ్చుమీరిపోతున్నాయి. చివరకు అధికారులుగా వున్నా సరే ఆడవాళ్లు అచ్యారారాలకు, మర్డర్ లకు గురవుతున్నారు. తాజాగా బీహార్ లోని ముజఫర్ పూర్ లో జరిగిన ఘటన తెలిస్తే గుండె జలదరిస్తుంది. ఆదివారం జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గుర్తు తెలియని దుండగులు ఓ మహిళా ఇంజనీర్ ను సజీవ దహనం చేశారు. అయితే ఆమె పాదరక్షలు, దుస్తుల ద్వారా ఆమె బజరంగ్ బీహార్ కాలనీకి చెందిన సరిత కుమారిగా పోలీసులు గుర్తించారు. ఆమె ఎమ్జిఎన్ రెగాలోని మురల్ బ్లాక్ లో జూనియర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది.

ఆమె ఉంటున్న గదిలోనే ఆమెను సజీవ దహనం చేశారు. ధరించిన దుస్తులు పక్కన పడి ఉండటంతో రేప్ చేసి ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు. అన్నికోణాల్లో కేసు దర్యాప్తు జరుగుతోంది.

English summary

Woman engineer raped and killed brutally