పిల్లల్ని కనడానికి సరైన ఏజ్ ఇదే

Woman Have to get pregnancy within 24 Years of Age

01:33 PM ON 31st May, 2016 By Mirchi Vilas

Woman Have to get pregnancy within 24 Years of Age

ఇదొక ఆసక్తికర అంశం లా వుంది కదూ..ఎందుకంటే, చాలామంది ఇళ్ళల్లో పిల్లల దగ్గర పెళ్లి సంగతి ఎత్తితే, నాకపుడే పెళ్ళొద్దు... ఇంకా చదువుకోవాలి... చాలా ప్లానింగ్ ఉంది... బాగా సంపాదించాక అప్పుడే పెళ్ళి అంటుంటారు కుర్రకారు. లైఫ్ అంతా ప్లానింగ్ చేసుకుంటున్నాం అంటూ ఏవేవో చెప్పేస్తుంటారు. నిజం చెప్పాలంటే, పెళ్ళి, సంతానం కంటే తమ కెరీర్ను తీర్చిదిద్దుకునే విషయానికే నేటి యువతీయువకులు అత్మంత ప్రాధాన్యం ఇస్తున్నారు. పెళ్ళి, పిల్లలు కంటే ముందు ఆర్థికంగా సెటిల్ కావాలని... ఆ తర్వాతే అన్నీ అని భావిస్తున్నారు. ఈ ఆలోచన మంచిదే కానీ, ఇదే లైఫ్ ప్లానింగ్ కాదని వైద్య నిపుణులు అంటున్నారు. పెళ్ళి, పిల్లల్ని కనడం కూడా ప్లానింగ్లో భాగమేనని గుర్తించాలంటున్నారు.

పిల్లలు కనడానికి అనువైన వయసు 18 నుంచి 24 సంవత్సరాలని సూచిస్తున్నారు. పెళ్ళి ఆలస్యం అయ్యేకొద్దీ గర్భం దాల్చే అవకాశాలు తగ్గిపోతాయట. 25 సంవత్సరాలు దాటిన తర్వాత గర్భం దాల్చే అవకాశం తక్కువట. అంతేకాదు, ఒక సర్వే ప్రకారం 25 నుంచి 31 సంవత్సరాల మధ్య వయసు గల వివాహితకు గర్భం దాల్చే అవకాశం 26 శాతానికి పడిపోతుందని, 31 నుంచి 35 సంవత్సారాల లోపు వారికి 38 శాతానికి పడిపోతుందని తేలిందట. 18 నుంచి 24 ఏళ్ళ లోపు వివాహితులకు పుట్టిన బిడ్డలు ఆరోగ్యంగా, మంచి బరువుతో పుడతారని తెల్చారట.

27 సంవత్సరాలు దాటితే, బిడ్డ బరువులో చాలా తేడాలుంటాయని సర్వేలో తేలింది. కృత్రిమ గర్భం కోసం ప్రయత్నించే వాళ్ళు, 35 ఏళ్ళ వయసు దాటిన వారే ఎక్కువ మంది ఉంటున్నారట. పురుషుడి వయసు పెరుగుతున్నకొద్దీ వారిలో శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోతుందట. పైగా అండ ఉత్పత్తి కూడా క్షీణిస్తూ, హార్మోన్లలో మార్పులు సంభవిస్తాయని, అండకోశాలు అండాన్ని హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంటాయని అంటున్నారు. అండాలు ఒక్కొక్కటి ద్రాక్ష కాయంత పరిమాణంలో ఉంటాయి. సుమారుగా ఒక అంగుళం నుంచి ఒటికన్నర అంగుళం పొడవు, వెడల్పు కలిగి ఉంటుంది.

గర్భ సంచి మూడు అంగుళాల పొడవు, రెండు అంగుళాల వెడల్పు ఉంటుంది. ఇది కండరాలతో నిర్మితమై ఉంటుంది. దీనిపై పొరను మయోమెట్రియం అంటారు. గర్భాశయం లోపల ప్రత్యేకమైన పొర ఉంటుంది. దీన్ని ఎండోమెట్రియం అంటారు. గర్భం కలిగితే, గర్భస్థ పిండం ఫెలోపియన్ నాళం గుండా ప్రయాణించి ఎండోమెట్రియంలో నాటుకుంటుంది. అక్కడి ఆహారాన్ని తీసుకుంటూ గర్భస్థ పిండం తొలినాళ్ళలో పెరుగుతుంది. వయసు పెరిగే కొద్ది గర్భధారణకు అనుమైన ఈ పరిస్థితుల్లో మార్పు వస్తుంది. అందుకే వయస్సు వచ్చాక పెళ్ళికి తొందర పడాల్సిందేనని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఏ వయస్సులో జరగాల్సిన ముచ్చట ఆ వయస్సులోనే జరగాలని పెద్దలు అందుకే చెప్పారు మరి.

ఇవి కూడా చదవండి:క్యాన్సర్ రోగులకు శుభవార్త

ఇవి కూడా చదవండి:ఈ డ్రింక్ తీసుకుంటే, అధిక బ‌రువు మాయం!

English summary

According to a survey found that the woman have to got pregnancy within 18 to 24 years of age. The woman who were in 25-30 years of age then the chances of getting pregnancy was decreased to 26 percentage.