హైదరాబాద్ లో  చైన్ స్నాచర్ల స్వైర విహారం

Woman Injured Chain Snatching Incident In Hyderabad

05:51 PM ON 10th November, 2015 By Mirchi Vilas

Woman Injured Chain Snatching Incident In Hyderabad

హైదరాబాద్ లో చైన్ స్నాచర్ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండాపోతోంది. చైన్ స్నాచర్ల జోరు ను అడ్డుకునేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలన్నీ బెడిసికొడుతున్నాయి . ఇటివల హైదరాబాద్ లో ఏదో ఒక మూల చైన్ స్నాచర్లు దాడి చేస్తునే ఉన్నారు. తాజాగా నిన్న ఉదయం సికింద్రాబాద్ లో ఉన్న సాయిబాబా గుడి సమీపంలో తన తండ్రితో స్కూటీ పై హాస్పిటల్ కు స్లోగా వెళ్తున్న వాళ్ళని లక్ష్యంగా చేసుకున్న దొంగలు .. నలుపు రంగు పల్సర్ పై వచ్చి మహిళ మెడలోని బంగారు గొలుసును దొంగిలించారు.

దీంతో ఆ మహిళ కింద పడి తీవ్రంగా గాయపడింది . ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు చైన్ స్నాచర్ల కోసం గాలింపు చేపట్టారు.

English summary

Woman Injured Chain Snatching Incident In Hyderabad