ఎంత ఘోరం .... ఎంత దారుణం ....

Woman Kills Herself In Hyderabad

11:41 AM ON 31st December, 2015 By Mirchi Vilas

Woman Kills Herself In Hyderabad

తోబుట్టువులా ఉండాల్సిన తోడికోడలు వ్యభిచారం చేయమంది. కొడుకులా ఉండాల్సిన మరిది కూడా ఆ దిశ గా వత్తిడి చేసాడు. తోడికోడలు , మరిది కల్సి వ్యభిచారంలోకి దింపాలని విశ్వప్రయత్నం చేస్తూ , వేధించడంతో, గత్యంతరం లేక ఆత్మహత్య చేసుకుంది ఆ ఇల్లాలు.

ఈ విషాద ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే, .....శంషాబాద్‌‌లోని గోపాల్‌- అలివేలు దంపతులు. వీళ్లకి 11 ఏళ్ల కిందట పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలూ ఉన్నారు. మరి వున్నట్లుండి ఏమైందోగానీ.. అలివేలును ఆమె తోడికోడలు మంగమ్మ, మరిది నర్సింహ వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారట. దీనికి ఆమె నిరాకరించింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకుని ఇతరులతో కలిసి ఫోన్లు చేయిస్తూ వేధింపులు స్టార్ట్ చేయించారట.

అంతేకాదు.... ప్రతి విషయాన్ని భూతద్దంలో చూపించి అవమానం చేసేశారు. కొన్ని సమస్యలపై పంచాయితీలో సైతం అలివేలు తీరును పెద్దలు. తప్పు పట్టేలా కుట్ర చేసారు. ఇది అలివేలు భరించలేకపోయింది. తీవ్ర మనస్తాపానికి గురైన అలివేలు మంగళవారం సాయంత్రం కిరోసిన్‌ పోసుకొని నిప్పటించుకొంది. మంటలను ఆర్పడానికి ప్రయత్నించిన ఆమె అత్త లక్ష్మమ్మకూ కూడా గాయాలయ్యాయి. అలివేలు ఉస్మానియా ట్రీట్‌మెంట్ పొందుతూ చనిపోయింది. గ్రామస్థుల ఫిర్యాదుతో నర్సింహ, మంగమ్మలతో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

English summary