సీఎం ని పబ్లిక్ గా ముద్దాడిన మహిళ (వీడియో)

Woman Kissed Karnataka CM Siddaramaiah

10:38 AM ON 27th June, 2016 By Mirchi Vilas

Woman Kissed Karnataka CM Siddaramaiah

అవునా అంటే అవును... ఎక్కడ అంటే బహిరంగ సభలో... కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య బుగ్గపై ఓ మహిళ ముద్దుపెట్టింది.... ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేస్తోంది. బెంగుళూరులో కురుబా సామాజిక వర్గం ప్రజాప్రతినిధుల సన్మానకార్యక్రమం జరిగింది. కర్నాటక సిఎం కూడా కురుబా సామాజిక వర్గం చెందినవాడే కావడంతో ఆయన కూడా ఈ వేడకకు వచ్చాడు. ఆ సందర్భంగా చిక్ మంగుళూర్ కు చెందిన పంచాయితీ సభ్యురాలైన గిరిజ ఆయనను సన్మానించారు. సన్మాన కార్యక్రమం అనంతరం గిరిజ ముఖ్యమంత్రి బుగ్గను ముద్దాడింది.

ఈ హఠాత్ పరిణామంపై సిఎం స్పందించేలోగా..ఆమె చకచకా స్టేజ్ దిగి వెళ్ళి పోయింది. అనంతరం స్థానిక మీడియాతో ఆమె మాట్లాడుతూ..సిద్ధరామయ్య తనకు తండ్రిలాంటివారని, ఆయనను తొలిసారి కలవడంతో ఆనందానికి లోనై ఇలా చేశానని వివరణ ఇచ్చింది. తనది సిద్దరామయ్య నియోజకవర్గమేనని గిరిజ తెలిపింది. మొత్తానికి ఏమైతేనేం సినీ యాక్టర్లకే కాదు రాజకీయ నాయకులకు ముద్దెట్టేస్తున్నారు.

ఇది కూడా చూడండి: చెట్ల మీదే ఇళ్లు... అదో థ్రిల్

ఇది కూడా చూడండి: చనిపోయిన వాళ్ళు కలలోకి వస్తే అలా అవుతుందా?

ఇది కూడా చూడండి: మహా భారత యుద్ధం తర్వాత అసలేం జరిగింది

English summary

In public Meeting one woman Kissed Karnataka CM Siddaramaiah.