ఇచ్చేది చాలడంలేదని పాపను వదేలేసింది 

Woman Leaves Her Child In front Of Judge

05:26 PM ON 21st January, 2016 By Mirchi Vilas

Woman Leaves Her Child In front Of Judge

పాపకు అయ్యే ఖర్చుకి , అందుకోసం ఇచ్చే సొమ్ము సరిపోవడంలేదని ఓ మహిళ తన బిడ్డను న్యాయమూర్తి ఎదుట వదిలేసి, వెళ్ళిపోయింది. నిర్వహణకు సరిపడా ఖర్చులు భర్త ఇవ్వడంలేదని ఏడాదిన్నర వయసు గల చిన్నారిని కడప ఫ్యామిలీ కోర్టు వద్ద వదిలేసి వెళ్లిపోయిన ఈఘటన సంచలనం కల్గించింది. వివరాల్లోకి వెళితే, కడపకు చెందిన భార్యాభర్తలు మనస్పర్ధల కారణంగా కొంతకాలం క్రితం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. అయితే వారికి ఒక పాప ఉంది. భార్యభర్తలు విడిగా ఉండటం వలన పాప ఖర్చులకు ప్రతినెలా రూ.3వేలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. కేసు విచారణ నేపధ్యంలో భార్యాభర్తలు కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా సదరు మహిళ... తన భర్త ఇచ్చే సొమ్ము, ఖర్చులకు ఏమాత్రం సరిపోవడం లేదంటూ తన బిడ్డను న్యాయమూర్తి ఎదుటే వదిలేసి వెళ్లిపోయింది. ఇదంతా అక్కడే ఉన్నపాప తండ్రి చూస్తూ వుండి పోయాడే తప్ప ఏమాత్రం పట్టించుకోకపోవడంతో న్యాయమూర్తి స్పందించి సీడబ్ల్యూసీ అధికారులకు అప్పగించారు. అదండీ సంగతి. ప్రస్తుతం సమాజంలో బంధాలు అనుబంధాలు ఎంత బలంగా వున్నాయో కదా ....

English summary

A woman left her baby in front the court judge and she says that the money that his husband giving was not sufficient to feed her baby.This was occured in Kadapa