వారెవ్వా! ఇక్కడ కూడా  మహిళలకు ప్రత్యేకమే  .....

Woman Liquor Store In Delhi

05:02 PM ON 30th December, 2015 By Mirchi Vilas

Woman Liquor Store In Delhi

అన్నింటా దూసుకుపోతున్న అతివలు మందు విషయంలో కూడా తక్కువేం కాదని నిరూపించారు. అందులో కూడా రిజర్వేషన్ కొట్టేసారు. తమకోసం ప్రత్యేక లిక్కర్ షాపులు తెరిపించుకుంటున్నారు. అది కూడా ఎక్కడో కాదు, దేశ రాజధాని డిల్లీలో. పైగా అక్కడ పనిచేసేవాళ్ళు కూడా మహిళలే. ఇంకేముంది చిందేయడమే ..... లిక్కర్ బ్యాన్ చేయాలంటూ ఉద్యమం చేసే మహిళలు.. ఇలాంటి షాపుల్లో పనిచేస్తే, ఇక ఆందోళన చేసేదెవరు? అందుకేనేమో మద్యం ప్రియులు ఇలాంటి టెక్నిక్ కనిపెట్టి వుంటారు.

వివరాల్లోకి వెళితే, దేశరాజధాని ఢిల్లీలో తొలిసారి మహిళల కోసమే స్పెషల్‌గా లిక్కర్ షాపు ఏర్పాటైంది. ఎటువంటి బిడియం లేకుండా నేరుగా మహిళలు ఆ షాపుకి వెళ్లి మద్యం పుచ్చుకోవచ్చు . అదేనండీ తాగొచ్చు. అది కూడా ఉత్తర ఢిల్లీలోని స్టార్ సిటీ మాల్‌లో!

అక్కడి సేల్స్ ఎగ్జిక్యూటర్స్, సెక్యూరిటీ గార్డ్స్ అంతా మహిళలే వుంటారు. మద్యం కోసం వచ్చే యువతులకు స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించేందుకే స్పెషల్‌గా లేడీస్ జోన్‌ని ఏర్పాటు చేశామని మాల్ నిర్వాహకుల ఉవాచ.

తమను ఎవరైనా చూస్తారనిగానీ, వేధింపులు ఎదురవుతాయని గానీ మహిళలు ఏమాత్రం అలోచించాల్సిన పనే లేదు. మద్య నిషేధం కోసం భవిష్యత్తులో ఉద్యమించే వాళ్ళే లేకుండా చేయడానికి ఈ కిటుకు బానే వుండే అంటూ పలువురు గుసగుసలాడుకుంటుకుంటున్నారు.

English summary