40లక్షలకు మాయలేడీ టోకరా

Woman Looted 40 Lakhs Through Facebook

01:08 PM ON 7th December, 2015 By Mirchi Vilas

Woman Looted 40 Lakhs Through Facebook

ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఒక పడతి మాయమాటలు చెప్పి ఒక వ్యక్తికి 40లక్షలకు టోకరా పెట్టింది. కోట్లు గడించే వ్యాపార అవకాశాలను ఇస్తానంటూ నమ్మబలికి పుణేకు చెందిన ఒక వ్యాపారిని మోసం చేసిన మాయలేడీ ఆ అమాయకుడిని నుండి దాదాపు 40లక్షలు దోచుకున్నాక మాయమైపోయింది. పుణేకు చెందిన 56ఏళ్ళ అహ్మద్‌బాబాయ్‌ అనే వ్యాపారవేత్తకు ఫేస్‌బుక్‌లో క్లెరా బ్రాన్‌సన్‌ అనే పేరిట ఒక మహిళ తాను లండన్‌కు చెందిన వ్యాపారవేత్తగా పరిచయం చేసుకుంది. తనకు ఆయుర్వేదానికి సంబంధించిన వ్యాపారాలు ఉన్నాయని, లండన్‌కు ఇండియానుండి ఆయుర్వేద ఉత్పత్తులు ఎగుమతి చేసే వ్యాపారాన్ని సదరు అహ్మద్‌కు ఇచ్చేందుకు ఉత్సాహం చూపిస్తున్నట్లుగా నటించింది. దీంతో సదరు వ్యాపారవేత్త గుడ్డిగా ఆ మాయలేడీని నమ్మాడు. ఇప్పటికే ఫార్మాసూటికల్‌ వ్యాపారంలో రాణిస్తున్న అహ్మద్‌కు ఆయుర్వేద వ్యాపారంపై కూడా మంచి పట్టు ఉంది. వచ్చిన మంచి వ్యాపార అవకాశాన్ని వదులుకోకూడదని భావించిన అహ్మద్‌ మాయలేడి చెప్పినట్లు వివిధ సందర్భాలలో 40లక్షలకు పైగా డబ్బును ఆమె చెప్పిన అకౌంట్లలో డిపాజిట్‌ చేసాడు. ఇంకేముంది డబ్బు అందగానే ఆ మోసగత్తె ఫత్తా లేకుండా మాయమైంది. ఫేస్‌బుక్‌లో కూడా ఎటువంటి స్పందన లేకపోవడంతో మోసంకు గురైనట్లు గ్రహించిన వ్యాపారవేత్త ఆఖరికి పోలీసులను ఆశ్రయించాడు. ఫేస్‌బుక్‌లో మాయలేడీ చాటింగ్‌ హిస్టరీను పరిశీలిస్తున్న పోలీసులు జరిగిన మోసంపై విచారణను ప్రారంభించారు.

English summary

A woman named clera branson from london looted 40 lakhs by saying false information to pune businessman ahmad on facebook.He complaint to police about this issue and police were in search of that lady