మొత్తానికి ఇండియాకు పెళ్లయింది

Woman Named India Got Married In Thanjavur

10:52 AM ON 9th September, 2016 By Mirchi Vilas

Woman Named India Got Married In Thanjavur

ఇండియా కు పెళ్లేంట్రా బాబూ నుకుంటున్నారా? పేరులో నేముంది? అనడం విన్నాం కదా. ఇదీ అదే. అందుకే నిజంగానే ఇండియాకు పెళ్లయింది. పైగా ఇండియాకు 24 ఏళ్ళు? ఇంతకీ మెడలో తాళి కట్టిందెవరో తెలుసా? జె. స్టాలిన్ఈ అనే వ్యక్తి. గురువారం మంచి రోజు కావడంతో మూడుముళ్లు వేశాడు. ఇంతకీ వివరాల్లోకి వెళ్తే, తమిళనాడులోని తంజావూరుకు చెందిన ఆర్.ఇళంగోవన్ ప్రముఖ సామాజిక వేత్త, గొప్ప జాతీయవాది. దేశమంటే ఎనలేని అభిమానమున్న ఆయన తన కుమార్తెకు ఇండియా అని పేరు పెట్టేసాడు. భారతీదాసన్ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ పట్టా అందుకున్న ఇండియా వివాహం ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు తన తండ్రి పెట్టిన పేరు చూసి తానెప్పుడూ బాధపడలేదని, చాలా సంతోషంగా, గర్వంగా ఉందని పేర్కొంది. దేశభక్తిపై తన తండ్రికి ఉన్న భక్తికి తన పేరే ఓ నిదర్శనమన్నారు. వింతగా ఉన్న తన పేరుతో చిన్నప్పుడు స్కూల్లోను, ఆ తర్వాత కాలేజీలోనూ కొంత ఇబ్బంది ఎదుర్కొన్నట్టు చెబుతూనే, అయితే తన పేరుపై విమర్శలు కన్నా ప్రశంసలే ఎక్కువగా వచ్చాయని అంటోంది. తన పేరు చూసి చాలామంది తనను వెక్కిరించే వారిని అయితే తానెప్పుడూ బాధపడలేదని కూడా చెప్పుకొచ్చింది. ప్రముఖ విప్లవ కవి, జాతీయవాది అయిన సుబ్రమణియ భారతి రాసిన ఎన్నో పాటలను స్కూలు, కాలేజీ రోజుల్లో పాడేదానినని గుర్తు చేసుకుంది. ఇళంగోవన్ గొప్ప పెయింటర్, ఆర్టిస్ట్ అని ‘ఇండియా’ అంకుల్ ఎ.కార్తికేయన్ చెప్పారు. మద్యం తదితర సామాజిక మహమ్మారిలపై ఆయన ఎన్నో డ్రామాలు వేశారని తెలిపారు. మొత్తానికి ఇండియా పేరు అవమానంతో పాటు గౌరవం కూడా తెచ్చిపెట్టింది.

ఇది కూడా చూడండి: నాన్ వెజ్ తిని గుడికి వెళ్ళొచ్చా?

ఇది కూడా చూడండి: దెయ్యాలు నివాసముండే ఫేమస్ సిటీస్ ఇవే!

ఇది కూడా చూడండి: సీతారామ, లక్ష్మణులు ఎలా చనిపోయారో తెలుసా?

English summary

Woman named India got married in Thanjavur.