నలుగురు అడ్డొచ్చినా, రెజ్లర్ ను ఓ యువతి ఉతికేసింది...

Woman open challenge with professional wrestler

01:01 PM ON 18th June, 2016 By Mirchi Vilas

Woman open challenge with professional wrestler

కండలుంటే సరిపోదు గుండెలో దమ్ముండాలని అంటుండడం వింటూ ఉంటాం. సినిమాల్లో కూడా చూస్తుంటాం. కానీ నిజ జీవితంలో కూడా దేనికైనా దమ్ముండాలి. డ్రమ్ములకొద్దీ తిన్నా, కండలు పెంచినా, మనసులో ధైర్యం లేకపోతే శుద్ధ దండుగే నని, మనో ధైర్యంతో కొండనైనా పిండి చేయవచ్చునని ఓ యువతి రుజువు చేసింది. ది గ్రేట్ ఖలీ నిర్వహించిన కాంటినెంటల్ రెజ్లింగ్ ఎంటర్ టైన్ మెంట్ అందుకు వేదికగా నిలిచింది. అక్కడ ఉన్నవాళ్ళంతా ఆమె సాహసాన్ని చప్పట్లతో అభినందించారు.

మహిళా రెజ్లర్ బీబీ బుల్ బుల్ రింగ్ లో నుంచి ఓ సవాల్ విసిరింది. దమ్ము, ధైర్యం ఉన్నవాళ్ళెవరైనా వచ్చి తనతో తలపడాలని రంకెలు వేసింది. చాలా సేపటి వరకు ఎవరూ ముందుకెళ్ళలేదు. ఇంతలో పసుపు రంగు సల్వార్, కమీజ్ ధరించిన ఓ యువతి ముందుకొచ్చి, ఆ సవాలును స్వీకరిస్తూ, ‘‘నేనున్నాను’’ అని దూసుకెళ్ళింది. ఆమె పేరు కవిత. వడివడిగా అడుగులేస్తూ వేదికపైకి వెళ్ళింది. బీబీ బుల్ బుల్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసింది. మొదట్లో కంగు తిన్నా, ఆ తర్వాత లేచి, బుల్ బుల్ ను కుమ్మేసింది. పిడిగుద్దులు కురిపిస్తూ ఉంటే బుల్ బుల్ నోట మాట రాలేదు. ఇంతలో ఇతర రెజ్లర్లు వచ్చి అడ్డుకున్నా కవిత మరో సివంగిలా విరుచుకుపడింది.

కవిత పంజాబీ అమ్మాయి. ఆమె రెజ్లర్ కాదు. కానీ గతంలో హర్యానా పోలీసు శాఖలో ఉద్యోగం చేసింది. ఆమె ఎంఎంఏ ఛాంపియన్ కూడా. ఆమె గుండె ధైర్యాన్ని ఓసారి వీక్షించండి.

ఇది కూడా చూడండి: విజయశాంతి బంగారం చోరీ(వీడియో)

ఇది కూడా చూడండి: 'శివగామి' ట్రైలర్ వచ్చేసింది(వీడియో)

ఇది కూడా చూడండి: కుర్ర హీరోకు 12 కుట్లు పడ్డాయి

English summary

A woman accepts an open challenge thrown by a professional wrestler.