పోలీసాఫీసర్ అయితేనేం.. తల్లిలా లాలించింది..

Woman police officer shows her humanity

06:09 PM ON 6th September, 2016 By Mirchi Vilas

Woman police officer shows her humanity

పోలీసులకు కూడా హృదయం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా మనలాంటి మనుషులే కదా. ఖాకీల వెనుక మానవత్వం కూడా దాగి ఉంటుందని ఎన్నో ఘటనలు నిరూపించాయి. ఇక తాజాగా మరో ఘటన ఇలాంటిదే చోటుచేసుకుంది. తాను పోలీసునైనా తనలో మాతృత్వం, మానవత్వం ఉన్నాయని, చిన్నారులంటే తనకెంతో మమకారమని మహిళా పోలీసు అధికారి చాటుకుంది. ఆమె పేరు మిషెల్లీ బర్టన్. తండ్రిని కోల్పోయి, తల్లికి కూడా దూరమైన నలుగురు చిన్నారులను అక్కున చేర్చుకుంది. ముఖ్యంగా, నెల రోజుల వయసున్న పసికందును ఎత్తుకుని లాలించింది. సోషల్ మీడియాలో విస్తృతంగా హల్ చల్ చేస్తున్న ఈ ఘటనకు సంబంధించి, పూర్తి వివరాల్లోకి వెళ్తే..

అమెరికా అలబామాలోని బర్మింగ్ హామ్ లో ఓ జంట డ్రగ్స్ కు బానిసయ్యింది. ఈ దంపతుల్లో 30 ఏళ్ళ వ్యక్తి మితిమీరిన డ్రగ్స్ తీసుకుని మరణించగా, అతని భార్య స్పృహ కోల్పోయి, చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఎవరో ఇచ్చిన సమాచారంతో వారి ఇంటివద్దకు తన సిబ్బందితో చేరుకుంది మిషెల్లీ బర్టన్. ఆ కపుల్ పిల్లలు తమ పేరెంట్స్ కోసం గుక్క పట్టి ఏడుస్తుండగా, చలించిపోయిన ఆ పోలీసాఫీసర్, వెంటనే స్పందించింది. తను పోలీసునన్న మాటను పక్కన పెట్టిన ఈమె, తన బులెట్ ప్రూఫ్ జాకెట్ తీసేసి నెల రోజుల పసిబిడ్డను అక్కున చేర్చుకుంది.

ఓ మాతృమూర్తిలా ఆమె, ఎవరో బిడ్డకు పంచిన ప్రేమ అందర్నీ కదిలించివేసింది. ఈ పిల్లల తల్లిని ఆసుపత్రికి పంపే ఏర్పాట్లు చేసింది. మిషెల్లీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈమె భర్త కూడా ఈ వైనాన్ని తెలుసుకుని తన భార్య ఉదార హృదయానికి హ్యాట్సాఫ్ చెప్పాడు. అన్నట్టు ఆ పిల్లలను అధికారులు చిల్డ్రన్స్ హోంకు తరలించారు. అదండీ పోలీసు హృదయం అంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

English summary

Woman police officer shows her humanity