ఇన్ఫోసిస్‌ క్యాంపస్‌లో అత్యాచారం 

Woman Raped In Infosys Campus In Pune

06:46 PM ON 29th December, 2015 By Mirchi Vilas

Woman Raped In Infosys Campus In Pune

ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ లో మహిళ అత్యాచారానికి గురైంది. పుణేలోని ఇన్ఫోసిస్ ఫేజ్-1 క్యాంపస్ లో ఆదివారం ఈ దారుణం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఇన్ఫోసిస్‌ కంపెనీకు చెందినా పూణే క్యాంపస్ లోని క్యాంటీన్‌లో క్యాషియర్‌గా పని చేస్తున్న మహిళ ఉద్యోగిని పై ఇద్దరు వ్యక్తులు అతి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు . అత్యాచారానికి పాల్పడిన ఆ ఇద్దరు వ్యక్తులు ఆమెతో పాటు ఆ క్యాంటీన్లో పని చేస్తున సహ ఉద్యోగులే కావడం గమనార్హం. బాధితురాలి ఫిర్యాదు మేరకు దీని పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు.

ఈ ఘటన పై స్పందించిన పుణే ఇన్ఫోసిస్ వారు మాట్లాడుతూ నిందితుల పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అలాగే క్యాంపస్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని తెలిపారు.

English summary

According to the police, the woman cashier working at a canteen in Pune Infosys was allegedly raped by two persons inside the canteen