భర్త ఎదుటే ... కారులో మహిళపై గ్యాంగ్ రేప్

Woman Raped Inside Moving Car in Haryana

04:08 PM ON 3rd November, 2016 By Mirchi Vilas

Woman Raped Inside Moving Car in Haryana

మహిళల రక్షణకు ఎన్ని చట్టాలు తెచ్చినా సరే ఎందుకు కొరగాకుండా పోతున్నాయా అన్న చందంగా దేశంలో కామాంధుల ఆగడాలు రోజురోజుకు పెచ్చుమీరిపోతున్నాయి. తాజాగా ముంబయిలోని అంబోలిలో భర్త పక్కన ఉండగానే, 28ఏళ్ల మహిళపై అతి కిరాతకంగా సామూహిక అత్యాచారం ఘటన ఇంకా మరువకముందే బుధవారం హరియాణాలో ఇంకో ఘటన వెలుగులోకి వచ్చింది. కదులుతున్న కారులో ఓ దళిత మహిళపై ముగ్గురు వ్యక్తులు లైంగికదాడికి పాల్పడిన సంఘటన తొహనా పోలీస్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళ రైల్వేస్టేషన్ కు వెళ్లేందుకు రోడ్డుపై నిలబడగా.. ఆమె ఎదురుగా వచ్చి ఓ కారు ఆగింది. తామూ అటువైపే వెళ్తున్నామని.. రైల్వేస్టేషన్ వద్ద విడిచిపెడతామని చెప్పి మార్గమధ్యలో ఆమెపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. మూడు గంటలపాటు కారులోనే నిర్బంధించి అనంతరం మహిళను రాత్రి 8గంటల సమయంలో దహమన్ గ్రామంలో వదిలిపెట్టి పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని అంటున్నారు. అయితే బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: గర్భిణీలు పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమౌతుందో తెలుసా?

ఇది కూడా చూడండి: రోజూ ఈ పని చేస్తున్నారా? అయితే 15ఏళ్లలో చనిపోతారట!

English summary

Woman Raped Inside Moving Car in Haryana.