భార్య అందుకు ఒప్పుకోవడం లేదని బొద్దింకలు వదిలాడు

Woman Says Husband Harassed With Cockroaches

10:43 AM ON 23rd January, 2017 By Mirchi Vilas

Woman Says Husband Harassed With Cockroaches

వికృత చేష్టలు ఎవరి చేస్తే ఏమో అనుకోవచ్చు చదువుకున్నవాళ్ళు అందునా టెక్నాలజీ తెలిసినవాళ్ళు పాల్పడే వికృత చేష్టలు తెలిస్తే షాకవ్వాల్సిందే. ఓ ప్రబుద్ధ ఐటీ ఇంజనీర్ ఏం చేసాడంటే, శృంగారానికి తనను దగ్గరికి రానివ్వడం లేదని భార్యపై పైశాచికంగా ప్రవర్తించాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన బెంగళూరు లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, బెంగళూరు నగరంలోని బన్నేరుఘట్టలో ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో ఇంజనీరైన అవినాశ్ శర్మ పదేళ్ల క్రితం తన క్లాస్ మేట్ ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆమె కూడా ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో ఇంజనీర్ గా పనిచేస్తోంది.

అయితే, అవినాశ్ కొద్దికాలంగా మరో మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అవినాశ్ ప్రవర్తన నచ్చక ఆమె దగ్గరకు రానివ్వడం లేదు. దీంతో ఎలాగైనా తన దారికి తెచ్చుకోవాలనుకున్న అవినాశ్ తన భార్యపై బొద్దింకలను వదులుతూ భయపెట్టేవాడు. తనతో శృంగారంలో పాల్గొనకుంటే ఇంతేనని వేధించడం ప్రారంభించాడు.

మొదట్లో తమ ఇద్దరు పిల్లల బాగు కోసం భర్త వేధింపులను భరించిన ఆమె రోజురోజుకూ వేధింపులు తీవ్రం కావడంతో ఇక తాళలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసును మహిళా సహాయ వాణికి బదిలీ చేశారు. నిందితుణ్ని పోలీసులు పిలిపించి విచారించగా, శృంగారం లో తనకు సహకరించకపోవడం తోనే బొద్దింకలు వదులుతూ వేధించినట్లు చెప్పాడు. దీంతో కేసు నమోదు చేసారు. దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: మహాభారత అశ్వత్థామ… ఇప్పటికీ ఆ ప్రాంతంలో తిరుగుతున్నాడా?

ఇది కూడా చూడండి: గ్రహాలు అనుకూలంగా లేకుంటే ఇబ్బందే.. అయితే ఏం చేయాలి

ఇది కూడా చూడండి: 2017 లో మన జాతకం ఇలా ఉంటుందట

English summary

Woman Says Husband Harassed With Cockroaches.