ఆమె మూడు ముళ్ళు వేయిమంది - అతడు 32సార్లు పొడిచి చంపేశాడు

Woman stabbed 32 times in Noida

11:42 AM ON 15th July, 2016 By Mirchi Vilas

Woman stabbed 32 times in Noida

తాజాగా ఢిల్లీలో దారుణం వెలుగుచూసింది. మూడు ముళ్ళు వేసి తనను మ్యారేజ్ చేసుకోవాలని ప్రియుడిపై ఓ మహిళ ఒత్తిడి చేసింది. దీంతో అతడికి పట్టరాని కోపం వచ్చేసింది. అంతే ఆమెని 32 సార్లు కసి తీరా పొడిచి చంపేశాడు. సంచలనం రేపిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. నొయిడాలో ఘజియాబాద్ లోని ఇందిరాపురానికి చెందిన 27 ఏళ్ల వరుణ్ గోయల్ జిమ్ ట్రైనర్ గా పని చేస్తున్నాడు. గోరఖ్ పూర్ జిల్లాకు చెందిన ఓ మహిళ.. విభేదాల కారణంగా ఆరేళ్ల నుంచి భర్తకు దూరంగా ఉంటోంది. నోయిడాలోని ఓ మొబైల్ కంపెనీలో జాబ్ చేస్తోంది.

వరుణ్ వర్క్ చేస్తున్న జిమ్ కు ఫిట్ నెస్ కోసం ఆ మహిళ వచ్చేది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య రిలేషన్ కాస్త,బంధంగా మారింది. దీంతో ఏడాదిగా ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. మ్యారేజ్ విషయం ఇద్దరి మధ్య తరచూ వివాదం జరిగేది. తనను పెళ్లి చేసుకోవాలని వరుణ్ పై ఒత్తిడి చేసింది ఆమె. దీంతో ఆగ్రహం చెందిన వరుణ్ కత్తితో ప్రియురాలిని 32 సార్లు పొడిచి పరారయ్యాడు. అపార్టుమెంట్ నుంచి మహిళ కేకలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు వచ్చి మహిళను ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన ట్రీట్ మెంట్ కోసం లోక్ నాయక్ జయప్రకాష్ హాస్పటల్ కి తరలించారు. అయినా ఫలితం దక్కలేదు. నినిందితునికోసం గాలిస్తున్నారు.

ఇది కూడా చూడండి : దెయ్యాలుండే ప్లేస్ లు ఎక్కడెక్కడంటే..

ఇది కూడా చూడండి : అందమైన అమ్మాయిలను అంగట్లో అమ్మేస్తున్నారు!

ఇది కూడా చూడండి : జుట్టు ఊడిపోతోందా.. అయితే ఉల్లి రసం పరిష్కారం

English summary

Woman stabbed 32 times in Noida.