ఒక మహిళ ఫూటుగా మందుకొట్టి

Woman tries to open exit door on British Airways flight

05:08 PM ON 18th November, 2015 By Mirchi Vilas

Woman tries to open exit door on British Airways flight

మద్యం తాగిన మత్తులో ఒక పడతి చేసిన రచ్చతో ఒక విమానంలో తీవ్ర కల్లోలం చెలరేగింది. అసలే పారిస్ లో జరిగిన మారణహోమంతో ప్రపంచమంతా భయంతో వణికిపోతుంటే...ఏ మూల ఎలాంటి దాడి జరుగుతుందోనని భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. అలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో ఎటువంటి సంఘటన జరిగినా దానికి తీవ్రవాదులతో లంకె పెట్టే పరిస్థితి ఉంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే మద్యం తాగిన మహిళ చేసిన గలాటాకు బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ విమానం ఎగరకుండా నిలిపివేయాల్సి వచ్చింది. అసలు వివరాల్లోకెళ్తే ఒక మహిళ ఫూటుగా మందుకొట్టి బ్రిటీష్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఉన్నట్టుండి ఎగ్జిట్ డోర్ తెరిచింది.

సామాన్యంగా ఆ తలుపుని ఏదైనా అత్యవసర పరిస్థితి ఎవరైనా, దాడికి పాల్పడినప్పుడో లేదా టెర్రరిస్టులు దాడి చేసినప్పుడో ఆ ఎగ్జిట్‌ డోర్‌ని తెరవాలి. కాని అలా ఏమి జరకుండా తాగిన మత్తులో ఆమె ప్రయత్నం చేయడంతో అక్కడి ప్రయాణికులు బెంబేలెత్తిపోయారుట. కొంత మంది అయితే మళ్ళీ టెర్రరిస్ట్ అటాక్ ఏమన్నా జరిగిందేమోనని హడలిపోయారు. విమాన సిబ్బంది పోలీసులకు అసలు విషయం చేరవేయడంతో ఆ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

English summary

Intoxicated female passenger attempted to open an exit door on a Boston bound British airways flight.