ఆవు చేలో మేసింది... మహిళ వేళ్లు నరికేశారు

Womans fingers chopped off as her cow entered in neighbours land

10:28 AM ON 20th July, 2016 By Mirchi Vilas

Womans fingers chopped off as her cow entered in neighbours land

అరెరే ఎంత దారుణం.. పొరుగునే ఉన్న పొలంలోకి ఆవు దిగి గడ్డి వేుసిందని ఇంత దారుణానికి ఒడిగడతారా? ఆవు పొలంలో దిగి పొలంలో మేసేసిందన్న సాకుతో ఆవు యజమాని- మహిళకి మధ్య వాదన పెరిగింది. ఆ ఆవేశాన్ని అణచుకోలేక, ఆమె కొడుకు పై కొంతమంది గ్రామస్థులు దాడి చేశారు. తీవ్రంగా గాయపరిచారు. అంతటితో వదల్లేదు. ఆమె చేతి వేళ్లను కూడా నరికేసారు. ఈ దుర్ఘటన బెంగాల్ లోని మాల్దా జిల్లా బైషణబ్ నగర్ లో వెలుగుచూసింది. గాయపడ్డ తల్లి కొడుకులు వైద్యం కోసం హాస్పిటల్ లో చేరడంతో ఈ దాడి సంఘటన బయటపడింది. దీనికి సంబంధించి హారుణ్ షేక్ అనే వ్యక్తితో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు.

చాలా చిన్న సంఘటనే అయినా పక్కనున్న వాళ్లు రెచ్చగొట్టడంతో హారుణ్ షేక్ ఈ దాడికి తెగబడ్డాడని పోలీసులు అంటున్నారు. ఈ దాడిలో పదునైన ఆయుధం వాడటంతో మహిళ చేతి వేళ్ళు రెండు తెగిపోయాయి. ఇదిలా వుంటే దాడి చేసి మహిళ చేతి వేళ్లు నరకడమే కాకుండా ఆ మహిళను వివస్త్రగా చేసి గ్రామంలో తిప్పారంటూ స్థానిక ఛానెళ్లు వార్తను ప్రసారం చేశాయి. అయితే పోలీసులు మాత్రం ఆ వార్తలు వాస్తవం కాదనీ, మహిళను నగ్నంగా ఊరేగించిన సంఘటనపై తమకెటువంటి కంప్లైంట్ అందలేదని చెబుతున్నారు. మొత్తానికి ఈ ఘటన సంచలనం సృష్టించింది.

English summary

Womans fingers chopped off as her cow entered in neighbours land