దేవుడిని నమ్మనివాళ్లలో సగమంది మహిళలే!

Women are the most Atheists in India

03:08 PM ON 29th July, 2016 By Mirchi Vilas

Women are the most Atheists in India

దేవుడిని నమ్మేవాళ్ళు చాలామంది కనిపిస్తారు. అయితే దేవుడు లేడూ, దెయ్యం లేదు అని చెప్పేవాళ్ళు, వాదించేవాళ్లూ ఉన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు కొంతమంది అసలు దేవుడనేవాడున్నాడా? అని అనుకుంటూ ఉండడం చూస్తున్నాం. అంతమాత్రం చేత, అలాంటివాళ్ళంతా నిజంగా దేవుడు లేడని మాత్రం అనుకోవడం లేదు. మన దేశంలో 120 కోట్ల మంది జనాభా ఉంటే అందులో దేవుడిని నమ్మనివాళ్ళు కేవలం 33 వేల మంది మాత్రమే ఉన్నారట. ఓ విధంగా ఇలా చెప్పడం అంటే ఆశ్చర్యం కలుగక మానదు. కానీ గత వారం విడుదలైన 2011 జనాభా లెక్కలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దేవుడున్నాడని నమ్మని వాళ్ళు 33వేలమంది ఉంటే, అందులో సగం మంది మహిళలే కావడం విశేషం.

దైవంపై నమ్మకం లేనివాళ్ళలో గ్రామీణులే ఎక్కువ. ప్రతి పదిమంది నాస్తికుల్లోనూ ఏడుగురు పల్లెవాసులే ఉన్నారట. దేశంలో నాస్తికుల సంఖ్యను బహిరంగంగా వెల్లడించడం ఇదే తొలిసారి కూడా. ఇక నాస్తికుల సంఖ్య మహారాష్ట్రలో అత్యధికంగా ఉంది. మొత్తం 9,652 మంది తమకు దేవుడున్నాడన్న నమ్మకం లేదని చెప్పారు. వీరిలో 71 శాతం మంది గ్రామీణులే కావడం గమనార్హం. మేఘాలయలో 9,089 మంది, కేరళలో 4,896 మంది, పశ్చిమ బెంగాల్ లో 784 మంది, ఢిల్లీలో 541 మంది నాస్తికులు ఉన్నట్లు ఈ లెక్కల్లో తేలింది.. 29 లక్షల మంది తాము ఏ మతానికి చెందినవారో చెప్పేందుకు కూడా ఇష్టపడలేదు. తమ విశ్వాసాలు వ్యక్తిగతమైనవని, మతం ప్రాతిపదికగా తమను చూడటానికి వీల్లేదని కొందరు ప్రభుత్వోద్యోగులు అన్నారట.

English summary

Women are the most Atheists in India