పనిలో మహిళలకు సరితూగాలంటే.. మగాళ్లకు ఇంకా ఎంత కాలం పడుతుందో తెలుసా?

Women are working more than men

11:07 AM ON 2nd November, 2016 By Mirchi Vilas

Women are working more than men

చదువులో అబ్బాయిలకన్నా అమ్మాయిలే బాగా దూసుకుపోతూ ర్యాంకుల పంట పండిస్తున్నారు. ఇక ఉద్యోగాల్లో, పనితనంతో కూడా మహిళలే పైచేయి అంటున్నారు. నిజానికి ఉద్యోగం పురుష లక్షణం అని పెద్దలు చెప్పారు. కానీ అది ఒకప్పటి మాట. నేడు మాత్రం ఆ పరిస్థితి లేదు. పురుషులతో సమానంగా మహిళలు, ఆ మాట కొస్తే కొంచెం ఎక్కువగానే వారు కష్టపడుతున్నారు. తమ కుటుంబం కోసం శ్రమిస్తున్నారు. ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరం తాజాగా చేసిన సర్వే ఆధారంగా చెబుతున్న నిజం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాలో పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా పనిచేస్తున్నారట.

మన దేశంలో ఆ శాతం ఇంకా ఎక్కువగానే ఉందని సదరు సంస్థ చేసిన సర్వేలో వెల్లడైంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్)కు చెందిన గ్లోబల్ జెండర్ గ్యాప్(ప్రపంచవ్యాప్తంగా ఉన్న లింగ తారతమ్యాలు) నివేదిక పైన చెప్పిన విషయాలను తాజాగా వెల్లడించింది.

1/4 Pages

ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో ఉన్న పురుషులు, మహిళల పనిగంటలను లెక్క తీసుకుని చూడగా తెలిసిందేమిటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురుషుల కన్నా మహిళలే ఏడాదికి 39 రోజులు ఎక్కువగా పనిచేస్తున్నారట. ఇది మన దేశంలో 50 రోజులుగా ఉందని తెలిసింది. అంటే మన దగ్గర ఓ పురుషుడి కన్నా స్త్రీ ఏడాదికి 50 రోజులు ఎక్కువగా కష్టపడుతుందట. సాధారణంగా ఎవరు పనిచేసినా అది ఏదైనా ఓ కంపెనీకో, సంస్థకో చేస్తే దాన్ని పెయిడ్ వర్క్ కింద పరిగణిస్తారు.

English summary

Women are working more than men