అమ్మాయిలా మజాకా - సోషల్ మీడియా డామినేట్

Women Dominate Every Social Media Network

12:55 PM ON 22nd July, 2016 By Mirchi Vilas

Women Dominate Every Social Media Network

అవునా, అంటే అవుననే వినిపిస్తోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా కుర్రకారు ఫేవరెట్ డిజిటల్ డెస్టినేషన్ సోషల్ మీడియా అనే సంగతి తెల్సిందే. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు. ఫేస్ బుక్ - ట్విటర్ - ఇన్ స్టాగ్రామ్ - పింట్రెస్ట్ - టంబ్లర్ ల... ఇలా ప్రతి సోషల్ మీడియా సైట్ యువతకు హాట్ ఫేవరెట్. అయితే... తాజాగా జరిపిన సర్వేలో ఓ విషయం తేలింది. యువతలో అమ్మాయిలు మరింత స్పీడుగా సోషల్ మీడియాలో దూసుకుపోతున్నారు. ఇంకా చెప్పాలంటే, సోషల్ మీడియా వాడకంలో అమ్మాయిలు అబ్బాయిలను డామినేట్ చేస్తున్నారట.

పాశ్చాత్యదేశాల్లో అమ్మాయిలే సోషల్ మీడియాను అధికంగా ఉపయోగిస్తున్నారని లేటెస్టు సర్వేలు తేల్చేస్తున్నాయి. ఇంటర్నెట్ వాడే వారిలో ఫేస్ బుక్ యూజర్లుగా ఉన్న అమ్మాయిల శాతం 76గా ఉందని తేలింది. ట్విట్టర్ వాడకంలోనూ ఫీమేల్ యూజర్లదే పైచేయి అంటున్నారు. పింట్రెస్ట్ - ఇన్ స్టాగ్రామ్ విషయంలోనూ ఇదే పరిస్థితి. వీటికీ అమ్మాయిల ఆదరణే ఎక్కువగా ఉంది. అమెరికాలో వీటికి యూజర్లుగా ఉన్న మహిళల సంఖ్య కోటికి చేరిందని అంటున్నారు. అయితే లింక్డ్ ఇన్ సైట్ మాత్రం మేల్ యూజర్ల డామినేషన్లో ఉందట.

మరి పాశ్చాత్య దేశాల సంగతి సరే.. భారత దేశం సంగతి చూస్తే, ఫేస్ బుక్ - ట్విటర్లు ఇంకా ఇండియాలో ఈ లెక్కలను రిలీజ్ చేయనప్పటికీ ఇక్కడ అమ్మాయిల కంటే అబ్బాయిల వాడకమే ఎక్కువ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. సాంకేతిక విషయంలోనూ ఇక్కడ లింగ వివక్ష ఉందని అంతర్జాతీయ టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. మనదేశంలో కూడా అమ్మాయిలు సోషల్ మీడియాలో డామినేట్ చేయడం ఎంతో దూరంలో లేదని అంటున్నారు.

ఇది కూడా చూడండి: సింగపూర్ డ్రింకుల పేర్లన్నీ బూతులే?

ఇది కూడా చూడండి: కేవలం 20 లక్షలతో ఫిల్మ్ తీసి, దిమ్మతిరిగేలా చేశారు

ఇది కూడా చూడండి: ప్రధానమంత్రే నాకు బీటేశాడంటూ బాంబ్ పేల్చింది

English summary

Women Dominate Every Social Media Network