సౌదీ ఎన్నికల్లో తొలిసారి మహిళల విజయం

Women Elected For The First Time In Saudi Arabia History

06:16 PM ON 14th December, 2015 By Mirchi Vilas

Women Elected For The First Time In Saudi Arabia History

సౌదీ అరేబియాలో జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా సుమారు 17 మంది మహిళలు మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రప్రథమంగా మహిళలకు ఈ ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించడంతోపాటు పోటీ చేయడానికి అనుమతించారు. ఈ సందర్భంలో పవిత్ర నగరం మక్కాలోని మద్రకా మున్సిపల్ కౌన్సిల్ సీటును సల్మా బింగ్ హిజబ్-ఒటీబీ గెలుచుకొంది. ఏడుగురు పురుషులను, ఇద్దరు స్త్రీలను ఈ క్రమం లో ఆమె ఓడించింది. అధికార ఎస్‌పిఎ వార్తా సంస్థ ఈ విషయం ప్రకటించింది. సౌదీ అరేబియా ప్రపంచంలోకే తీవ్రమైన కొన్ని విధి నిషేధాలను స్త్రీలపట్ల అనుసరిస్తున్న సంపూర్ణ రాచరిక దేశం. కేవలం పురుఫులకే అక్కడ ఓటుహక్కు ఉండేది. ఈ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలలో స్త్రీలకు కూడా తొలిసారి ఓటు హక్కు, పోటీ చేసే హక్కులను కల్పించడంతో ఒటీబీ ఎన్నిక సాధ్య మై, ఆమె ఆ దేశ చరిత్రలో నిలిచిపోయింది. శనివారం జరిగిన పోలింగ్‌లో స్త్రీ పురుష విభజన పాటించారు. మొత్తం 6,440 మంది అభ్యర్థులలో 900 మంది స్త్రీలు. మహిళా అభ్యర్థులను నేరుగా పురుష ఓటర్లను కలుసుకోనివ్వలేదు. ఓటర్లుగా నమోదులో మహిళలకు అధికారుల నుంచి నిర్లిప్తత, రవాణాలోపం కూడా ఎదురయ్యాయి. 18 ఏళ్లు, అంతకు మించిన 15 లక్షల మందికి కొత్తగా ఓటు హక్కు కల్పించారు. ప్రచారంనుంచి మహిళా హక్కుల ఉద్యమకారులను మినహాయించారు.

English summary

Saudi Arabians have voted 17 women into public office in municipal elections in the conservative Islamic kingdom, the first time to allow female participation in saudi elections