భర్త నపుంసకుడు, న్యాయం చేయండంటూ ఓ మహిళా టెక్కీ షాకింగ్ కామెంట్స్

Women filed a case against her husband

06:35 PM ON 13th February, 2017 By Mirchi Vilas

Women filed a case against her husband

గతంలో ఇళ్లల్లో ఏమైనా విషయాలుంటే గడప దాటి వచ్చేవి కావు. కొందరు అయితే పరువు పోతుందని చాలా సహనంతో బాధను దిగమింగుకుని మసలుకునేవారు. ఇక అత్తమామల వేధింపులను కూడా భరించేవారు. కానీ కాలం మారింది. మీడియా విస్తృతి పెరిగింది. ఏ విషయం దాగడం లేదు. అందుకే పోలీసు కేసులు కూడా పెరిగాయి. ఇక మహిళా టెక్కీ షాకింగ్ కామెంట్స్ చేస్తూ, పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కింది. 'నాభర్త నపుంసకుడు, తొలి రాత్రే ఈ విషయం తేలిపోయింది. తేటతెల్లమైంది.నాకు న్యాయం చేయండి' అంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకొంది. బెంగుళూరులో పేరు పొందిన సాఫ్ట్ వేర్ కంపెనీలో ఇద్దరు ఐటి ఇంజనీర్లు 2011 లో ప్రేమించి పెళ్ళి చేసుకొన్నారు.తన భర్త కునాల్ శ్యామ్ తొలి రాత్రే అతను నపుంసకుడని తేలిందని ఆ మహిళా టెక్కీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

భర్త కునాల్ శ్యామ్ ప్రతి రాత్రి తనను దూరం పెడుతున్నాడని ఆమె తన గోడు వెళ్లబోసుకొన్నాడు. ఒకవేళ తన భర్త సంతానభాగ్యం కల్పిస్తే తన ఫ్లాట్ ను అతడిపేరుతో రాసిస్తానని ఆమె సవాల్ విసిరింది. తనతో కాపురం చేయాలని పదే పదే నిలదీయడంతో నపుంసకుడనే విషయం బట్టయలైందని చెప్పింది.ఆనాటి నుండి ఆయన ఇంటిని వదిలివెళ్ళిపోయాడని చెప్పారు. వివాహమైన రోజు నుండి తనతో తన భర్త కాపురం చేయలేదని చెప్పారు. ఈ విషయమై తన అత్తమామలు, ఆడపడుచులు వేధిస్తున్నారని వివాహిత ఆరోపించారు. పోలీసులు ఆమె భర్తను వెతికి తీసుకురావాలని ఆమె కోరింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

English summary

Bangalore women filed a case to police against her husband.