నటుడు  ఆలీ తీరుపై మహిళల నిరసన

Women Fires On Ali

01:47 PM ON 9th November, 2015 By Mirchi Vilas

Women Fires On Ali

సినీ నటుడు ఆలీ ఈమధ్య టివి యాంకర్ ప్రోగ్రాం లలో మరీ అశ్లీల వ్యాఖ్యలు చేస్తున్నాడని, సినీ ఫంక్షన్ లలో సైతం పెద్ద హీరోయిన్ లను కూడా వదిలి పెట్టకుండా అశ్లీల జోకులు వేస్తున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. కథనాలు సరేసరి. అయితే ఒక ప్రముఖ టీవీ చానెల్‌లో నిర్వహిస్తున్న కార్యక్రమంలో మహిళలపట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నాడంటూ సినీ నటుడు అలీకి వ్యతిరేకంగా విశాఖలో మహిళా సంఘాలు ఆందోళన నిర్వహించాయి. విశాఖ లో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన అలీ... హోటల్‌లో దిగినట్టు తెలుసుకున్న మహిళా చేతన స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అక్కడకు వెళ్లి ధర్నా చేశారు. అలీ తాను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కార్యక్రమంలో మహిళలను ఉద్దేశించి ద్వంద్వార్థాలు వచ్చేలా అసభ్యకరంగా మాట్లాడుతూ వారిని అగౌరవపరుస్తున్నాడని వారు ధ్వజమెత్తారు. అలీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలిసి అక్కడకు చేరుకున్న పోలీసులు.. ఆందోళనకారులను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. అయితే అలీ ఫోన్‌ చేసి.. మహిళలకు క్షమాపణ చెప్పడంతో వారు శాంతించారు. ఇకనైనా ఆలీ పంధా మార్చు కుంటాడా , లేదా ? అనేది వేచిచూడాలి.

English summary

Women Fires On Ali