ఆమె ఖాతాలో 1.4లక్షల కోట్లు  

Women got trillion dollars balance on bank account

03:17 PM ON 27th November, 2015 By Mirchi Vilas

Women got trillion dollars balance on bank account

ట్రిలియన్‌ డాలర్‌లలో ఎన్ని సున్నాలుంటాయో తెలుసా. చాలా మందికి దానికి సమాధానం తెలియకపోవచ్చు. కానీ అంత కొండంత డబ్బు మీ బ్యాంక్‌ ఖాతాలో ఉందనుకోండి మీరేమి చేస్తారు. ప్రపంచంలోనే కుభేరులకు సైతం సాధ్యం కాని సంపద అది. అలాంటిది ఒక సాధారణ మహిళ తన ఖాతాలో ఒక్కసారిగా 1.4ట్రిలియన్‌ల డబ్బును చూసి అవాక్కయ్యింది. అసలు వివరాల్లోకెళితే యుఎస్‌లోని హవాయికి చెందిన అంజెలావాంగ్‌ అనే మహిళ రోజూవారీగా తన ఖాతాను ఆన్‌లైన్‌లో తెరిచే సరికి, తన ఖాతాలోని బాలెన్స్‌ డబ్బును చూసి తనను తానే నమ్మలేకపోయింది. ఒక సారి తన కళ్ళు సరిగా కనిపించడం లేదేమోనని కళ్ళ జోడు తుడుచుకుని మరీ చూసింది. కానీ తన ఖాతాలో 1.4 ట్రిలియన్‌ డాలర్ల డబ్బు కనిపించడంతో తనను తానే గిల్లుకుని చూసింది. వెంటనే ఏదో తప్పు జరిగి ఉంటుందని బ్యాంకును సంప్రదించిన అంజెలీనాకు కంప్యూటర్‌లో సాంకేతిక సమస్య ఏర్పడడం వలన ఆ సమస్య వచ్చిందని సమాధానం వచ్చింది.

సమస్య ఏదేనైతేనేమి అంజెలా కొన్ని నిముషాలపాటు ప్రపంచంలోనే అత్యధిక సంపన్నురాలిగా ఉండగలిగిందన్న మాట.

English summary

Woman surprise when she logged into her bank account statement Tuesday morning only to find an outstanding balance of more than $1.4 trillion