మహిళలను రక్తం వచ్చేలా కొట్టిన పోకిరీల గ్రూప్ (వీడియో)

Women hardly beaten by Roadside Rascals

11:12 AM ON 6th January, 2017 By Mirchi Vilas

Women hardly beaten by Roadside Rascals

న్యూ ఇయర్ సందర్బంగా మహిళల పట్ల బెంగళూరులో పోకిరీల ఆగడాల వ్యవహారంపై దేశవ్యాప్తంగా సంచలనం చెలరేగి, జోరుగా చర్చ నడుస్తోంది. ఇది ఇంకా ముగియక ముందే మరోవైపు మహారాష్ర్టలో అలాంటి షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. లోనావాలోలో కొంతమంది పోకిరీలు పర్వతారోహకులను దారుణంగా కొట్టారు. డిసెంబర్ 31న పూణెకి 50 కిలోమీటర్ల దూరంలోవున్న లోనావానాలోని విసాపూర్ కోటకు ఓ పర్వాతారోహకులు టీమ్ వెళ్లింది. రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో 12 మంది పోకిరీల గ్రూప్ ఒకటి ట్రెక్కర్లపై దాడి చేసింది. మహిళలను రక్తం వచ్చేలా కొట్టింది. చివరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన బయటపడింది. ఇప్పటివరకు ఆరుగుర్ని మాత్రమే అరెస్ట్ చేసిన పోలీసులు.. మిగతా వాళ్ల కోసం గాలింపు చేపట్టారు.

ఢిల్లీలో అయితే పోలీసులపైనే తిరగబడ్డారు
అంతేకాదు ఢిల్లీలో జరిగిన మరో ఉదంతం బయటికి వచ్చింది. దేశ రాజధాని దిల్లీలోని ముఖర్జీ నగర్ పరిధిలో డిసెంబర్ 31 రాత్రి ఒక యువతిపై వేధింపులకు పాల్పడిన కొందరు యువకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన ఆ యువకులు పోలీసులపై తిరగబడ్డారు. పోలీసు వాహనాలను ధ్వంసం చేసి ఇద్దరు మహిళా పోలీసు సిబ్బందిని గాయపరిచారు.
డిసెంబర్ 31 రాత్రి మేమంతా విధులు నిర్వహిస్తున్నాం. ఆ సమయంలో ఇద్దరు యువకులు, ఒక యువతి ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. అయితే కొందరు యువకులు వారిని వెంబడిస్తూ వచ్చి ఆ యువతిని కిందికి లాగేందుకు ప్రయత్నించారు. దానిని గమనించి వెంటనే మేము ఆమెను రక్షించాం. వారిలో ఇద్దరిని పట్టుకున్నాం’ అని ఓ పోలీసు అధికారి తెలిపారు. తప్పించుకొని వెళ్లిన యువకులు మళ్లీ తిరిగి వచ్చి పోలీసు వాహనంపై రాళ్లు రువ్వారని, ఈ ఘటనలో కొందరు మహిళా పోలీసులకు కూడా గాయాలయ్యాయని, యువకులు చాలా ఎక్కువమంది ఉన్నారని, తమ సిబ్బంది కొంత మందే ఉండటంతో వారిపై ఎదురుదాడి చేయలేకపోయామని పోలీసు అధికారి అన్నారు.

ఇది కూడా చూడండి : ఇవి సడెన్ గా ఆపేస్తే… లావై పోతారట నిజమా?

ఇది కూడా చూడండి : షాకింగ్ న్యూస్: గర్భిణీ మెదడులో మార్పులు!

ఇది కూడా చూడండి : కిడ్నీలను శుభ్రంగా ఉండాలా అయితే దివ్యౌషదం తయారుచేసుకోండి

English summary

Women were hardly beaten by roadside rascals in Pune.Women harassment cases are increasing,Bangalore incident was still not solved again the same incident repeated.