పెళ్లాడిన అమ్మాయిని వ్యభిచారం చేయమన్న ప్రబుద్ధుడు

Women harresed mentally by her Husband

11:30 AM ON 25th January, 2017 By Mirchi Vilas

Women harresed mentally by her Husband

నమ్మించడం , మోసం చేయడం మగాళ్లకు అలవాటేనని, మోసపోవడం ఆడాళ్ళ వంటని అంటుంటారు చాలామంది. మరి ఇక్కడ అదే తరహాలో ఓ యువతి దారుణంగా మోసపోయింది. సభ్య సమాజం సిగ్గుపడేలా వ్యవహరించామన్న అతడి నిజస్వరూపం బట్టబయలు చేసింది. పూర్తివివరాల్లోకి వెళ్తే, మాయమాటలతో ఓ యువతిని నమ్మించి పెళ్లి చేసుకున్నాడు. నెల తర్వాత అసలు రూపం బయటపెట్టాడు. నీలి చిత్రాలు చూడాలనీ, వ్యభిచారం చేయాలనీ ఆమెను ఒత్తిడి చేశాడు. మోసపోయానని గ్రహించిన ఆ యువతి కుటుంబ సభ్యుల వద్దకు చేరింది. ఆ వంచకుడి కుటుంబం గురించి విచారిస్తే నిర్ఘాంతపోయే వాస్తవాలు తెలిశాయి. దీంతో బాధితురాలు కుటుంబ సభ్యులతో కలసి సోమవారం అర్బన్ ఎస్పీ త్రిపాఠిని కలిసి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు తెల్పిన వివరాలు ఇలా ఉన్నాయి.

అమరావతి రోడ్డులోని రామాబిల్డింగ్ ప్రాంతానికి చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకుంటానంటూ కొద్ది నెలల క్రితం నెహ్రూనగర్ రైల్వే గేటు ప్రాంతానికి చెందిన పెనుముచ్చు సుమన్ , అతని కుటుంబ సభ్యులు సంప్రదించారు. తాను హైదరాబాద్ లో ఏజంట్ గా పని చేస్తున్నానని, నెలకు రూ. 25 వేలు జీతం వస్తుందని చెప్పుకొచ్చాడు. దీంతో పెళ్లికి ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించారు. నవంబర్ 20న వివాహం జరిపించారు. ఇక అప్పుడు నిజస్వరూపం బయట పడింది. దీంతో నెల రోజుల తరువాత నుంచి ఆమెకు వేధింపులు ప్రారంభమయ్యాయి. నీలి చిత్రాలు చూడాలని బెదిరించాడు. తన స్నేహితులు ఇంటికి వస్తారనీ, వారితో వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేసేవాడు.

వ్యభిచారం చేస్తే డబ్బులు వస్తాయని, సంతోషంగా బతకవచ్చని ఒత్తిడి పెంచాడు. సుమన్ అక్క సునీత వచ్చి తాము వ్యభిచారం చేసి పైకి వచ్చామని, నీవు కూడా చేస్తే ఒక స్థాయికి రావచ్చని బెదిరించింది. వ్యభిచారం చేయకపోతే నరికేస్తానని కూడా హెచ్చరించింది. ఇదే విషయమై ఈ నెల 18న రాత్రి సుమన్ తో గొడవ జరిగింది. దీంతో అతడు ఆమె తాళిబొట్టు తెంచుకొని, పెళ్లి ఫొటోలు తీసుకొని వెళ్లిపోయాడు. దీంతో బాధితురాలు 19న పుట్టింటికి వెళ్లి జరిగిన విషయం చెప్పగా కుటుంబ సభ్యులంతా నెహ్రూనగర్ లోని సుమన్ ఇంటికి వెళ్లారు. అప్పటికే అతడు మరో మహిళతో వచ్చి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడని స్థానికులు చెప్పారు. అక్కడి నుంచే ఫోన్ చేయగా సుమన్ తన తల్లి, అక్కతో కలిసి అక్కడకు వచ్చి బాధితురాలిపై దౌర్జన్యం చేశాడు. తాము చెప్పినట్లు వింటే హైదరాబాద్ తీసుకువెళతామనీ, లేదంటే నీవు మాకు అవసరం లేదనీ చెప్పేశాడు. దీంతో బాధితురాలు అర్బన్ ఎస్పీని కలసి న్యాయం చేయాలని పిర్యాదు చేసింది.

ఇది కూడా చూడండి : మీ అర చేతిలో ఇలాంటి గుర్తు ఉంటె మీకు తిరుగులేదు

ఇది కూడా చూడండి : గ్రహాలు అనుకూలంగా లేకుంటే ఇబ్బందే.. అయితే ఏం చేయాలి

English summary

A women was tortured by her husband mentally he married her recently and after one month he showed his reality.She approached police to help her.