షాక్: మందు బాబులు కన్నా... మందు భామలే ఎక్కువట!

Women is drinking alcohol more than Men

11:01 AM ON 26th October, 2016 By Mirchi Vilas

Women is drinking alcohol more than Men

మందుబాబులం మేము మందుబాబులం అనే పాటకు అనుగుణంగా తెగ తాగేస్తున్న మందుబాబులు ఇక బాధపడాల్సిన అవసరం లేదట. ఎందుకంటే వారికి ఇప్పుడు మగువలు కూడా తోడయ్యారు. ప్రపంచవ్యాప్తంగా మద్యం తాగే మహిళల సంఖ్య ఎక్కువైందని, పురుషుల కంటే మహిళలే కొంచెం అధిక మోతాదులో మద్యం తీసుకుంటున్నారని ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. సో.. మద్యం విషయంలో ఇప్పటి వరకు ఉన్న లింగ భేదానికి ఫుల్ స్టాప్ పడినట్టే. నిజానికి చారిత్రకంగా కూడా మహిళలతో పోలిస్తే మద్యం తాగడంలో ముందుండేది మగవారే. ప్రస్తుతం ట్రెండ్ మారిందని, ఈ విషయంలో మహిళలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదని అధ్యయనకర్తలు అంటున్నారు.

1980 నుంచి 2014 వరకు ఇటువంటి విషయాలపై నిర్వహించిన 68 అంతర్జాతీయ అధ్యయనాలను పరిశోధకులు పరిశీలించారు. 1948-2014 వరకు సేకరించిన ఈ డేటా 1891 కంటే ముందు జన్మించిన వారికి సంబంధించినదే కావడం గమనార్హం. ఈ మొత్తం అధ్యయనాలను విశ్లేషించగా మద్యం తాగే విషయంలో స్త్రీ, పురుషుల మధ్య ఉన్న దూరం క్రమంగా తగ్గిపోయినట్టు తేలింది. అంతేకాదు మగవాళ్లతో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా మహిళలే కొంచెం ఎక్కువ తీసుకుంటున్నట్టు వెల్లడైంది.

English summary

Women is drinking alcohol more than Men