లేడీ టెక్కీ ఆత్మహత్య!- ఆఫీస్ పై నుంచి దూకేసింది

Women made a sucide and spoiled her beautiful future

11:09 AM ON 20th January, 2017 By Mirchi Vilas

Women made a sucide and spoiled her beautiful future

క్షణికావేశంలో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీంతో బంగారు భవిష్యత్తు గల ఎదరొ ఈ లోకం వీడుతున్నారు. తాజాగా మరో మహిళా టెక్కీ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. వైట్ ఫీల్డ్ లో ఆఫీస్ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది ఒక మహిళా సాఫ్ట్ వేర్ ఇంజినీర్. హర్యాన్ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్న శోభా లక్ష్మీనారాయణ (30) అనే యువతి ఆఫీస్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మండ్యకు చెందిన శోభా ఆమె కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరులోనే నివాసం ఉంటోంది.

తోటి ఉద్యోగులు చెబుతున్న వివరాల ప్రకారం.. గురువారం కూడా ఎప్పటిలాగే ఆఫీసుకు వచ్చిన శోభా... ఎప్పటిలాగానే తనసీటులో కూర్చుని సిస్టం ఆన్ చేయడం అనంతరం కాఫీ ఏరియాలోకి వెళ్లడం జరిగిందని చెబుతున్నారు. అయితే ఆ సమయంలో కాఫీ తాగడానికి ఆ చోటికి వెళ్లిందని అనుకున్నామే తప్ప నాలుగో అంతస్తులో ఉన్న కాఫీ ఏరియా నుంచి దూకేస్తుందని అనుకోలేదని వారు చెప్పుకొస్తున్నారు.

అలా దూకేసిన శోభా తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమేమైనా కారణమా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారట.

ఇది కూడా చూడండి : జియో స్పీడ్ పెరిగిందా లేదా?

ఇది కూడా చూడండి : ఈ ఫోన్ స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో సంచలనమే!

ఇది కూడా చూడండి : జియో 4జీ కనెక్షన్ తీసుకున్నారా? అయితే మీ పంట పండినట్లే

English summary

A lady working in software company made suicide,She really spoiled her wonder life. Decisions in a angry mood will definitely harm the future