స్త్రీలు ఆరోగ్యం గురించి శ్రద్ద తీసుకోవలసిన విషయాలు

Women Shouldn’t Ignore this symptoms

06:31 PM ON 4th March, 2016 By Mirchi Vilas

Women Shouldn’t Ignore this symptoms

సాదారణంగా మహిళలు ఇంటి పరంగానూ మరియు వృత్తి పరంగానూ ఉత్తమంగా ఉండాలనే ఆలోచనతో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం ఉంటారు. నొప్పులు,అలసట,అసౌకర్యం వంటి వాటిని అశ్రద్ద చేస్తే తీవ్రమైన పరిణామాలకు దారితీస్తాయి. మహిళలు వారి శరీరంపై శ్రద్ద పెట్టి రెగ్యులర్ గా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అనేక వ్యాధులను ప్రారంభ రోగ నిర్ధారణ మరియు సరైన చికిత్స చేయించుకుంటే తీవ్రమైన లేదా ప్రాణాంతకం కాకుండా నిరోధించవచ్చు. ఇప్పుడు అశ్రద్ద చేయకూడని కొన్ని రోగ లక్షణాలను తెలుసుకుందాం.

1/11 Pages

1. అసౌకర్యం మరియు అలసట

చాలా మంది మహిళలు అనేక బాధ్యతల్లో మునిగిపోవుట వలన అసౌకర్యం మరియు అలసట వంటి సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు.  బిజీ షెడ్యూల్ కారణంగా అలసినప్పుడు కొంతసేపు విశ్రాంతి తీసుకుంటే అలసట తగ్గినప్పుడు అది పెద్ద సమస్య కాదు. అయితే జీవితంలో అలసట ఒక బాగంగా మారితే కనుక అది దీర్ఘకాలిక అలసట సిండ్రోమ్ లక్షణంగా గుర్తించాయి. పురుషుల కంటే మహిళల్లో నాలుగు రెట్లు ఎక్కువగా ఈ సిండ్రోమ్ తో బాధపడుతున్నారు. అలసట అనేది నిరాశ, లివర్ ఫెయిల్యూర్, రక్తహీనత, క్యాన్సర్, కిడ్నీ వైఫల్యం, గుండె వ్యాధి, థైరాయిడ్ వ్యాధి, స్లీప్ అప్నియా మరియు మధుమేహం వంటి అనేక వైద్య పరిస్థితులతో ముడిపడి ఉంది. అలసట రెగ్యులర్ గా ఉంటే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ ని సంప్రదించాలి.

English summary

Here are some medical symptoms women shouldn’t ignore. Health problems among women not only affect their beauty and body, but also their ability to have children and take care of their family.