హోదా కోసం అమ్మోరిలా పూనకంతో ఊగిపోయారు(వీడియో)

Women special dances for AP special status

11:55 AM ON 1st August, 2016 By Mirchi Vilas

Women special dances for AP special status

ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం కుండబద్దలు కొట్టినట్లు చెప్పేయడంతో నిరసనల హోరు ఊపందుకుంది. ఎవరి తరహాలో వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు. ఇప్పుడు హోదా కోసం తిరుపతిలో మహిళలు వినూత్న నిరసన చేసారు. జుట్లు విరబోసుకుని, అమ్మోరి పూనకం వస్తే ఎలా చేస్తారో అలాంటి డ్యాన్సులతో హోరెత్తించారు. హోదా ఇవ్వకుంటే కేంద్రం భరతం పడతామని హెచ్చరిస్తూ ఏపీ మహిళా సమాఖ్య ఆధ్వర్యాన జరిగిన ఈ వెరైటీ ప్రొటెస్ట్ స్థానికులను విశేషంగా ఆకర్షించింది. హోదా కోసం అన్ని రాజకీయ పార్టీలూ కలిసికట్టుగా పోరాడాలని మహిళలు కోరుతున్నారు. ఢిల్లీలో నిరసన తెలపడానికైనా వెనుకాడబోమని అంటున్నారు.

English summary

Women special dances for AP special status