దొంగ బాబాలను తుక్కు రేగొట్టారు(వీడియో)

Women thrashed fake astrologers

10:57 AM ON 27th June, 2016 By Mirchi Vilas

Women thrashed fake astrologers

ఈమధ్యన ఓ దొంగ బాబా మత్తు మందు కలిపిన ప్రసాదం ఇచ్చి, లక్షలాది రూపాయలు దోచేసిన ఘటన ఇంకా మరిచిపోక ముందే తాజాగా బెంగుళూరులో ఇద్దరు దొంగ బాబాల గుట్టు రట్టయింది. దీంతో వాళ్ళను స్థానికులు, మహిళలు కూడా తలో చెయ్యీ వేసి వారిని చితకబాదారు. వివరాల్లోకి వెళ్తే.. బెంగుళూరు కమలానగర్ లోని తమ కార్యాలయంలో చెయ్యి చూసి జ్యోశ్యం చెబుతామని, తాము బాబాలమని చెప్పుకుంటూ ఈ ఇద్దరూ తమ దగ్గరకు వచ్చే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వచ్చారు. కమలానగర్ లో శ్రీ చౌడేశ్వరీ జ్యోతిష్యాలయం పేరిట దుకాణం తెరిచిన వీరు కొన్నాళ్ళుగా ఇలా మహిళలను జోస్యం పేరిట లైంగికంగా వేధించారు.

చివరకు ఈ మహిళల్లో ఓ బాధితురాలు వీరి విషయమై కర్నాటక రక్షణ వేదికకు ఫిర్యాదు చేసింది. దీంతో పృథ్వీరాజ్, మోహన్ అనే దొంగ బాబాలపై రక్షణ వేదిక సభ్యులు హిడెన్ కెమేరాతో నిఘా పెట్టగా వీళ్ళ అసలు రంగు తెల్సింది. ఇక అంతా కలిసి ఈ నకిలీ జ్యోతిష్కుల పని పట్టారు. ఉతికి ఆరేశారు. చివరకు బసవేశ్వర నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వీళ్ళను అరెస్టు చేశారు.

English summary

Women thrashed fake astrologers