అబార్షన్ తరువాత మంచి ఆరోగ్యం కోసం ఇవి తినండి..

Women want to eat these food after abortion

12:11 PM ON 26th September, 2016 By Mirchi Vilas

Women want to eat these food after abortion

అబార్షన్ తర్వాత మహిళ తన ఆరోగ్యం త్వరగా సాధారణ స్ధితికి చేరటానికి వీలుగా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఇందులో ముఖ్యంగా ఆహారం పట్ల అతి జాగ్రత్త వహించాలి. అబార్షన్ కోసం, చేసిన ఆపరేషన్ చిన్నదే అయినప్పటికి శరీరంలో అధిక దుష్ఫ్రభావాలు చూపే అవకాశం వుంది. అబార్షన్ చేయించుకోవటమనేది మహిళ జీవితంలో ఒక దురదృష్టకర సంఘటన. సాధారణంగా వైద్యులు మరీ అత్యవసరమైతే తప్ప అబార్షన్ వైపు మొగ్గుచూపరు. నెలలు అధికమైన కొన్ని అబార్షన్లు మహిళను కూడా ప్రమాదంలో పడేస్తాయి. నేటి రోజులలో అబార్షన్ చట్టబద్ధమైనప్పటికి పెద్ద ప్రాణానికి ఎప్పుడూ ముప్పుగానే భావిస్తూంటారు.

రక్తస్రావం అధికమవుతుంది, శరీరంలో ఐరన్, విటమిన్ బి 12, బి9, బి2 లేదా రిబోఫ్లావిన్ స్ధాయిలు తగ్గుతాయి. ఆమె ఎంతో బలహీనపడుతుంది. తగిన విశ్రాంతి కూడా కావాలి. రక్తహీనత, ఎముకల అరుగుదల మొదలైనవి తగ్గటానికి తీసుకునే ఆహారంలో ఐరన్, బి బిటమిన్, కాల్షియం మొదలైనవి వుండటం అత్యవసరం. మహిళ తగిన పోషకాలు కలిగిన ఆహారం తీసుకుంటే, అబార్షన్ తర్వాత బలహీనతనుండి త్వరగా కోలుకోగలరు. అబార్షన్ అయ్యాక మహిళ ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూద్దాం...

1/7 Pages

పాలు:


తక్కువ కొవ్వు గల పాల ఉత్పత్తుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. పాల ఉత్పత్తులు ప్రొటీన్లను, విటమిన్లను ఎక్కువగా ఉంటాయి. అబార్షన్ తర్వాత శరీరానికి కావల్సిన విటమిన్స్ న్యూట్రీషియన్స్ ను అందిస్తుంది.

English summary

Women want to eat these food after abortion