సముద్రం లో భారీ వింత జీవి

Wonder Creature Captured In Japan

11:16 AM ON 30th December, 2015 By Mirchi Vilas

Wonder Creature Captured In Japan

జపాన్‌ సముద్ర తీరంలో ఒక అరుదైన సముద్ర జీవి కనిపించింది. స్థానిక మత్స్యకారులు సముద్రంలో చేపలు పడుతుండగా ఈ భారీ వింత జీవి వారికి కనిపించింది. తెలుపు, ఎరుపు రంగుల్లో ఉన్న ఈ జీవి మత్స్యకారులు పడవ దగ్గర అటూ ఇటూ తిరుగుతూ వారిని ఆశ్చర్య పరచింది.

ఈ వింత జంతువు పై వారు మాట్లాడుతూ ఈ జీవిని 'స్క్విడ్‌' అంటారని తెలిపారు. ఈ జీవి కొంత సమయం పాటు సముద్ర ఉపరితలం పై ఈదుతూ కనిపించిందని మత్స్యకారులు తెలిపారు. ఈ జీవి 12-14 అడుగుల పొడవుందని,ఈ జాతి జీవులు దాదాపు 43 అడుగుల మేర పెరుగుతాయని తెలిపారు. ఈ అరుదైన జీవిని వారు తమ కెమెరాలో బందించారు ఆ వీడియోను మీరు ఓసారి చూడండి.

English summary