ఈ నెల 9న ఆకాశంలో అద్భుతం!

Wonder in sky

10:19 AM ON 7th May, 2016 By Mirchi Vilas

Wonder in sky

దశాబ్దంలో ఎనిమిది సార్లు సంభవించే అద్భుతం ఈ నెల 9న ఆకాశంలో జరగనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బుధ గ్రహం సూర్యుడిని ఈ నెల 9న దాటనుందని శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే.. ఈ ఘటనను నేరుగా చూడరాదని హెచ్చరించారు. కళ్లజోళ్లు పెట్టుకొని మాత్రమే వీక్షించాలని సూచించారు. డైరెక్ట్ గా చూస్తే కంటికి ప్రమాదమని కుడా చెబుతున్నారు. గతంలో 1999, 2003, 2006లో చోటుచేసుకున్న ఈ అద్భుతం.. సోమవారం సాయంత్రం చోటు చేసుకుంటుంది. ఉత్తర, దక్షిణ అమెరికాలు, ఐరోపా, ఆస్ట్రేలియా దేశాల్లో సూర్యోదయం సమయంలో సంభవించే ఈ ఘటన.. మన ఇండియాలో మాత్రం సాయంత్రం 4:15 నుంచి 6:20 నిమిషాల మధ్య కనిపించనుందని చెప్పారు.

అలాగే, ఎలా పడితే అలా చూస్తే.. ఇది కనిపించే అవకాశాలు తక్కువని స్పష్టం చేసారు. అలా కనిపించినా చిన్న తోకచుక్కవలే కనిపిస్తుందని పేర్కొన్నారు. దీంతో ఈ అద్బుతాన్ని వీక్షించేందుకు చెన్నైలోని బిర్లా ప్లానెటోరియంలో నాలుగు టెలిస్కోప్ లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. బుధుడు ఒక చిన్న డాట్ లా మాత్రమే కనిపిస్తాడని చెబుతున్నారు. మళ్లీ ఓ 10 ఏళ్ళ తరువాత మాత్రమే ఈ అద్భుతాన్ని వీక్షించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

English summary

Wonder in sky. In this month may 9th their is a wonder in sky. This wonder will come for every 10 years.