ఈ ఆగష్టు 11 రాత్రి ఆకాశంలో అద్భుతం! డోంట్ మిస్ ఇట్..

Wonder in sky on August 11th night

12:39 PM ON 9th August, 2016 By Mirchi Vilas

Wonder in sky on August 11th night

ఈ నెల, అనగా ఆగష్టు 11 రాత్రి ఆకాశంలో ఒక అద్భుతం చోటు చేసుకోనుంది. అసలు విషయంలోకి వెళితే.. 'అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించలేరు, జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదు' అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ అద్భుతం మాత్రం ఎప్పుడు జరుగుతుందో శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ అద్భుతానికి సమయం ఆసన్నమవుతోంది! మినుగురు పురుగుల వెలుగులాగా కనిపించే నింగి... మరింత ప్రకాశవంతం కానుంది. గంటకు సుమారు 200 వరకూ ఉల్కలు భూవాతావరణంలోకి ప్రవేశించి ఒక్కసారిగా భారీ వెలుగును ఉత్పత్తి చేస్తాయని నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు... వారి అంచనా ప్రకారం, ఆగస్టు 11న అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ ఆకాశంలో ఈ అద్భుతాన్ని చూడొచ్చు.

ఈ ఉల్కలు సెకనుకు 59 కిలోమీటర్ల వేగంతో భూవాతావరణంలోకి వచ్చే సమయంలో అడ్డువచ్చే దుమ్ము, ధూళి కణాలను ఢీకొన్నప్పుడు మండిపోయి భారీ వెలుగు వస్తుంది.ఈ అద్బుతం మిస్ కాకండి.

English summary

Wonder in sky on August 11th night