ఈ కార్తీక పౌర్ణమికి ఆకాశంలో అద్భుతం.. ఎప్పుడో తెలుసా?

Wonder in sky on November 14th

10:22 AM ON 4th November, 2016 By Mirchi Vilas

Wonder in sky on November 14th

అప్పుడప్పుడు అద్భుతాలు ఆవిష్కృతమవుతూనే వున్నాయి. అది భూమ్మీద కావచ్చు, ఆకాశంలో కావచ్చు. సరిగ్గా ఇప్పుడు అదే జరగబోతోంది. వినీలాకాశంలో అద్భుతం ఆవిష్కరణ కానుంది. నిజంగా ఇలాంటి ఘట్టాలు చిరస్థాయిగా మన మదిలో నిలిచి ఉంటాయి. జనవరి 1948 తర్వాత ఇలాంటి అద్భుతం ఇప్పటి వరకూ జరగని అద్భుతం ఆవిష్కరణ కానుందని అంటున్నారు. ఒకవేళ ఇప్పుడు మిస్సయితే, దాదాపు 2034 వరకు జరిగే అవకాశం లేదు. 21వ శతాబ్ధంలోనే ఎప్పుడూ జరగని, జరిగే అవకాశంలేని విధంగా చంద్రుడు భూమికి అత్యంతసమీపానికి రానున్నాడని అంటున్నారు. అసాధారణమైన ఈ సంఘటన నవంబర్ 14 కార్తీక పౌర్ణమి నాడు జరగనుంది.

1/4 Pages

ఆరోజున దాదాపు 14 శాతం పెద్దగా, 30 శాతం ప్రకాశవంతంగా చంద్రుడు కనిపించనున్నాడు. వినీలాకాశంలో ఈ నెల 14న దాదాపు రెండు గంటలపాటు ఈ అద్భుతం ఆవిషృతమవుతుందని అంటున్నారు. చంద్రుడు పెద్దగా కనిపించడాన్ని సూపర్ మూన్ గా పేర్కొంటారు. 14న జరగబోయే ఈ ఘటనలోచంద్రుడు సూపర్ మూన్ కంటే ఇంకా పెద్దగా కనిపించనున్నాడు. చంద్రుడు భూమికి అత్యంత సమీపానికి చేరుకోవడాన్ని పెరిజీ అంటారు.

English summary

Wonder in sky on November 14th