రేపిస్టులను కాల్చేస్తాం .... అయితే ...

Won't hesitate to shoot rapists if law permits

12:33 PM ON 5th January, 2016 By Mirchi Vilas

Won't hesitate to shoot rapists if law permits

'మహిళలపై నేరాలకు ఒడిగట్టే వారిని సంఘటనా స్థలంలోనే కాల్చిపారేస్తామని, ఈ విషయంలో పోలీసులు ఏ మాత్రం సంకో చించేదిలేదు' అని ఢిల్లీ నగర పోలీసు కమిషనర్ బీఎస్. బస్సీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే మన రాజ్యంగం అలాంటి వాటికి అనుమతి ఇవ్వదని ఆయన పేర్కొన్నారు. అందుకే ప్రతి వ్యక్తి మానవహక్కులను గౌరవిస్తూ, పోలీసులు రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటున్నారని బస్సీ వ్యాఖ్యానించారు. మహిళలను ప్రతి ఒక్కరు గౌరవించాలని ఆయన సూచించారు. దురదృష్ట మో ఏమో గానీ మహిళలపై అత్యాచారాలు ,లైంగిక దాడులు పెరిగిపోయాయని ఆయన విచారం వ్యక్తం చేసారు. 'భారత రాజ్యంగం అనుమతించి ఉంటే, మహిళలపై నేరాలకు పాల్పడేవారిని ఢిల్లీ పోలీసులు సంఘటనా స్థలంలోనే కాల్చివేయడమో, ఉరి తియ్యడమో చేసేవారు. అయితే మేం మానవహక్కలకు కట్టుబడి వున్నాం. వాటిని గౌరవిస్తాం' అని సిపి బస్సీ స్పష్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో మహిళలపై జరుగుతున్న నేరాలకు లింగ నిస్పత్తిలో భారీ అగాధం ఉండటమే కారణం గా ఆయన విశ్లేషించారు. 'ప్రస్తుతం వెయ్యి మంది పురుషులకు 600 మంది మహిళలు ఉన్నారు. కొందరు మగవాళ్లు మహిళలను తల్లిగా, చెల్లిగా, కుమార్తెగానే చూడటం లేదు' అని ఆయన విచారం వ్యక్తం చేశారు.

మహిళలను కేవలం సరుకుగా భావిస్తున్నారని, అందువల్లే 21 ఏళ్ల యువకుడు 80 ఏళ్ల వృద్దురాలు, 5 ఏళ్ల బాలిక మీద కూడా అత్యాచారానికి ఒడిగడుతున్నాడని బస్సీ వివరించారు. ఢిల్లీ పోలీసులు కేజ్రీవాల్ సర్కార్ ఆధీనంలో లేకపోవడం మా అదృష్టం అంటూ ఇదే సందర్బంలో అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ పై పరోక్షంగా విమర్శలు చేశారు.

తాము కేజ్రీవాల్ ప్రభుత్వం ఆధీనంలో ఉంటే స్థానిక ప్రయోజనాల కారణంగా తమ మీద రాజకీయ ఒత్తిడి ఉండేదని, ప్రధాని, కేంద్ర హోం శాఖ మంత్రికి ఆ ఉద్దేశం లేకపోవడంతో స్వేచ్చగా తమపని తాము చేసుకుని పోతున్నామని బస్సీ వ్యాఖ్యానించారు.

English summary

Delhi Police Commissioner BS Bassi says that rapists should be shooted or hanged immediately. He says that every one has to respect woman