ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు దిక్సూచి... భారత్‌

World Bank On Indian Economy

05:13 PM ON 8th January, 2016 By Mirchi Vilas

World Bank On Indian Economy

తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారత్‌ దిక్సూచిలా నిలుస్తోందని ప్రపంచ బ్యాంకు కొనియాడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం వృద్ధిరేటును సాధిస్తుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ప్రపంచ బ్యాంకు ప్రతి ఆర్నెల్లకోసారి విడుదల చేసే ప్రపంచ ఆర్థిక ప్రగతి నివేదికలో 2015లో 0.2 శాతం, 2016, 2017లో 0.1 శాతం వంతున భారత ఆర్థిక ప్రగతి అంచనాలను కుదించింది. అయితే ప్రస్తుతం చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నందున భారత్‌ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు దిక్సూచిగా కొనసాగుతుందని భావిస్తున్నట్లు ప్రపంచ బ్యాంకు తన నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది 7.8 శాతం, రానున్న రెండేళ్ల కాలంలో 7.9 శాతం వంతున భారత్‌ ఆర్థిక ప్రగతి సాధిస్తుందని అంచనా వేసింది. 2015లో చైనా ఆర్థిక ప్రగతి 6.9 శాతం మాత్రమే ఉంటుందని అంచనా వేసింది. ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం 2016లో చైనా ఆర్థిక ప్రగతి 6.7 శాతం, 2017, 18 లలో 6.5 శాతం వంతున ఉంటుందని తెలుస్తోంది. రష్యా, బ్రెజిల్‌ ఆర్థిక వ్యవస్థలు ఈ ఏడాది కూడా మాంద్య పరిస్థితుల్లోనే కొనసాగుతాయని ఈ నివేదిక చెబుతోంది.

English summary

The World Bank on Wednesday projected that India will grow by a robust 7.8 per cent in 2016 and 7.9 per cent in the next two years