2017 అక్టోబరులో ప్రపంచం అంతమైపోతోందట

World gets desstroy in October 2017

11:23 AM ON 6th January, 2017 By Mirchi Vilas

World gets desstroy in October 2017

ఆమధ్య కలియుగాంతం అయిపోతోందని, ఫలానా సంవత్సరంలో భీభత్సం అయిపోతుందని ఇలా రకరకాల కధనాలు వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ ఏడాది అక్టోబరులో ప్రపంచం అంతమైపో తుందని అంటున్నారు. ఇది నిజమా అంటే అవునని ప్లానెట్ ఎక్స్ - ది 2017 అరైవల్ పుస్తక రచయిత, వూహాజనిత సిద్ధాంతకర్త డేవిడ్ మియాడే అంటున్నారు. నిబిరు అనే ఓ గ్రహం భూమి వైపు దూసుకొస్తోందని, అక్టోబరులో అది భూమిని ఢీకొంటుందని చెబుతున్నారు. నిబిరు గ్రహాన్నే ప్లానెట్ ఎక్స్ గానూ పిలుస్తుంటారు.

వూహాజనితమైన ఈ గ్రహం సౌరకుటుంబం అంచున ఉంటుందని విశ్వసిస్తున్నారు. ఇది ఈ ఏడాది అక్టోబరులో భూమిని బలంగా ఢీకొంటుందని, ఫలితంగా ప్రపంచం అంతమైపోతుందని డేవిడ్ పేర్కొంటున్నారు. కానీ, దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు. శాస్త్రవేత్తలు మాత్రం నిబిరు అనే గ్రహమే లేదని చెబుతున్నారు. ఇలాంటివన్నీ ఇంటర్నెట్ లో కనిపించే బూటకపు వార్తలని నాసా కూడా గతంలోనే స్పష్టం చేసిన సంగతి తెల్సిందే. చూద్దాం ఏమి జరుగుతుందో.

ఇది కూడా చూడండి : ఆమె చదివింది పదే.. కానీ నెలకు 2 లక్షలు సంపాదిస్తుంది. ఎలాగో తెలుసా

ఇది కూడా చూడండి : ఇవి సడెన్ గా ఆపేస్తే… లావై పోతారట నిజమా?

ఇది కూడా చూడండి : షాకింగ్ న్యూస్: గర్భిణీ మెదడులో మార్పులు!

English summary

Every time we are listening that, the end of this Era came.Again the same issue raised.Scientist David meyaday mentioned in his book that this Era came to End.