సహస్రం దాటిన ... ముంబై కుర్రాడు     

World Record Breaking Batting By Mumbai Youngster

04:47 PM ON 5th January, 2016 By Mirchi Vilas

World Record Breaking Batting By Mumbai Youngster

అవును ఇది వయస్సు కాదు , పరుగులు ... ముంబయి కుర్రాడు ప్రణవ్‌ ధనవాడే ప్రపంచ క్రికెట్‌లో సంచలనం సృష్టించాడు. దీంతో 116 ఏళ్ల రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. సరికొత్త రికార్డు నెలకొల్పిన ఈ వ్యవహారంలోకి వెళితే , ముంబయి క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రికెట్‌ టోర్నమెంట్‌లో కేసీ గాంధీ జట్టు తరపున బరిలోకి దిగిన ప్రణవ్‌ నిన్న ఒక్కరోజే 652 పరుగులు సాధించి మైనర్‌ క్రికెట్‌లో రికార్డులు సృష్టిస్తే, ఈరోజు అయితే మరింత రెచ్చిపోయి 1000 పరుగుల మైలురాయిని దాటి బ్యాటింగ్‌ కొనసాగిస్తున్నాడు. తన 323 బంతుల్లో 1000 పరుగులు చేశాడు. అత్యద్భుత ఇన్నింగ్స్‌తో ప్రణవ్‌ ప్రపంచ క్రికెట్‌లో అన్ని విభాగాల్లో ఉన్న బ్యాటింగ్‌ రికార్డులన్నీ తిరగరాశాడు. 1899లో ఆర్థర్‌ కొలిన్స్‌ చేసిన 628 పరుగులే క్రికెట్‌లో ఇప్పటివరకు అత్యధిక స్కోరుగా రికార్డులో ఉంది. వందేళ్ళ పైనాటి రికార్డు బద్దలు కొట్టిన ప్రణవ్ కి క్రికెట్ అభిమానులు జేజే లు కొడుతున్నారు. ప్రణవ్ గో యే హెడ్ ...

English summary

A younster named Pranav Dhanvaade creates a new history in first class cricket.He scores 1000 runs in just 323 balls