ప్రపంచంలో అతి పెద్ద సాంటా క్లాస్‌

World's Biggest Sand Santa Claus Is In India

02:45 PM ON 26th December, 2015 By Mirchi Vilas

World's Biggest  Sand Santa Claus Is In India

ప్రపంచంలోనే అతిపెద్ద పాంటా క్లాస్‌గా భారత సైకతశిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ ఒరిస్సాలో ఇసుకతో చేసిన శిల్పం రికార్డు సృష్టించింది.

ఈ ఇసుక శిల్పాన్ని సుదర్శన్‌ పట్నాయక్‌తో పాటు అతని విద్యార్దులు ఎన్నో గంటలు కష్టపడి 45 అడుగుల సాంటా ఇసుక శిల్పాన్ని తయారుచేసారు. క్రిస్మస్‌ పండుగ సందర్భంగా ఈ శిల్పాన్నిరూపొందించారు.

ఈ సందర్భంగా సుదర్శన్ పట్నాయక్ మాట్లాడుతూ , దీని కోసం 1000 టన్నుల ఇసుకను, రంగులను ఉపయోగించినట్లు సుదర్శన్‌ పట్నాయక్‌ తెలిపారు. ఈ శిల్పానికి తనతో పాటు తన 20 మంది విద్యార్దులు దాదాపు 22 గంటల పాటు కష్టపడి తయారుచేసామని అన్నారు. ఈ ఇసుక శిల్పాన్ని 2016 జనవరి 1 వ తేది వరకు ప్రదర్శనకు ఉంచుతామని అన్నారు. లిమ్కాబుక్‌ ఆప్‌ రికార్డ్స్‌ లో ఈ శిల్పాన్ని నమోదు చెయ్యాల్సిందిగా కోరామని అన్నారు.

సుదర్శన్‌ పట్నాయక్‌ ఇది వరకు జీసస్‌, మదర్‌ మేరి వంటి అనేక మంది ప్రముఖుల శిల్పాలను ఇసుకతో తయారుచేసి అందరినీ ఆకట్టుకున్నాడు.


English summary