వామ్మో, ఇదెక్కడి బైక్ అండి బాబూ! (వీడియో)

Worlds first rideable Motorized Luggage

11:30 AM ON 25th July, 2016 By Mirchi Vilas

Worlds first rideable Motorized Luggage

అవునా, అని చాలామంది నోరెళ్ళ బెట్టవచ్చు గానీ, టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ యుగంలో కొత్తకొత్త ఆవిష్కరణలు వస్తూనేవు న్నందున ఇదేమీ ఆశ్చర్యం కాదు. సరిగ్గా, ఇప్పుడు అలాంటి కొత్త ప్రయోగంతో షికాగోకు చెందిన బిజినెస్ మేన్ కెవిన్ డెనెల్ ఆకట్టుకున్నాడు. ఓ ఇంజినీర్ హెల్ప్ తో ఏకంగా సూట్ కేస్ బైక్ ని రెడీ చేశాడు. ప్రపంచంలో ఫస్ట్ తొలి సూట్ కేసు మోటార్ బైక్ ఇది. సూట్ కేసు బైక్.. వినడానికి విచిత్రంగా ఇది చాలా డిఫరెంట్ గురూ!

లగేజీతోపాటు మనల్ని కూడా సునాయాసంగా మోసుకెళ్లే సామర్థ్యం దీని సొంతం. లిథియం బ్యాటరీతో పనిచేసే ఈ సూట్ కేసు బైక్, గంటకు 13 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఇక ఎయిర్ పోర్ట్ , రైల్వేస్టేషన్లలో లగేజీతోపాటు సింపుల్ గా వెళ్లేందుకు అనువుగా వుంటోంది. సూట్ కేసుపై కూర్చొని హ్యాండిల్ పైకి లేపి మోడో బ్యాగ్ ను ఆపరేట్ చేయవచ్చు. కాళ్లు పెట్టుకునేందుకు వీలుగా ఫుట్ పెడల్స్ కూడా వున్నాయి. అంతేకాకుండా ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జింగ్ చేసేందుకు స్పెషల్ గా యూఎస్ బీ పోర్టులున్నాయని కెవిన్ అంటున్నాడు. ఈ సూట్ కేసు బైక్ టెక్నాలజీ ప్రియులను ఎంతోగానో ఎట్రాక్ట్ చేసుకుంటోంది. ఇక ఎందుకు ఆలస్యం ఈ వీడియోపై ఓ లుక్కేద్దామా!

ఇవి కూడా చదవండి:కబాలి మూడు రోజుల కలక్షన్స్ ఎంతో తెలుసా.!

ఇవి కూడా చదవండి:యూరప్ టూర్ లో ఈ భామలు ఒకే హోటల్లో ...

English summary

Here is the wolrd's first ever motorized luggage named Modobag which will make you comfortable and reliable when you were in the places like Airport etc. Even there are two USB ports in this Rideable Bike to charge up your electronic devices.