ప్రపంచంలోనే అతి పొడవైన భవనం

Worlds Tallest Building

04:54 PM ON 1st December, 2015 By Mirchi Vilas

Worlds Tallest Building

ఇప్పటి వరకు ప్రపంచంలో అతి పెద్దదైన భవనం దుబాయ్‌ లో ఉండేది. బుర్జ్‌ ఖలిఫా అనే భవనం దుబాయ్‌లో ఉంది. బుర్జ్‌ ఖలిఫా భవనమే ఇప్పటి వరకు అత్యంత పెద్దదైన భవనంగా గిన్నీస్‌ ప్రపంచరికార్డులో కొనసాగింది. అయితే ఇప్పడు ఈ భవవనం తన రికార్డును కోల్పోయే పరిస్థితి వచ్చింది .

సౌదీ ఆరేబియా లో నిర్మించనున్న జీదాటవర్‌ నిర్మాణానికి నిధులు సమకూర్చుకుంది. 1.2 బిలియన్‌ డాలర్ల వ్యయంతో ఈ ప్రోజెక్ట్‌ను ప్లాన్‌ చెసారు.ఈ భవనం ఏకంగా 3,280, అడుగుల ఎత్తుతో నిర్మించనున్నారు బుర్జ్‌ఖలిఫా ఎత్తు 2,722 అడుగులుగా ఉంది. జీదా టవర్‌ ను ఎర్ర సముద్రం తీర ప్రాంతం గుండా నిర్మిస్తున్నారు. దీని ఎత్తు 3,280 అడుగుల అంటే 9 ఫుట్‌బాల్‌ మైదానాల అంత ఎత్తు. ఈ భవనంలో మొత్తం 200 ఫ్లోర్లకు గాను 26 ఫ్లోర్లు ఇప్పటికే పూర్తయ్యాయి.

ఈ భవనంలో లగ్జరీ హోటళ్ళు, ఆఫీసులు, అపార్టమెంట్‌లు, విలాసవంతమైన ఇళ్ళు, ఉండనున్నాయి. ఈ బిల్డింగ్‌లో మెత్తం 59 ఎలి వేటర్లు ,5 డబులడెక్‌ ఎలివేటర్లు ,12 ఎస్కలేటర్లు ఉండనున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక భవన నిర్మాంణంలో అనేక సవాళ్ళు ఎదురుకానున్నాయి. సముద్రతీర ప్రాంతంలో నిర్మితమవుతున్నందు వల్ల బలమైన సముద్ర గాలులు వీపరీతంగా విస్తుండండంతో ఈ భవనం నిర్మాణాన్ని ఫ్లోరు ఫ్లోరుకు మార్పులు చేస్తూ నిర్మించనున్నారని ఇంజీనీర్లు తెలిపారు.

English summary

The worls tallest building Dubai's Burj Khalifa holds Guinness World Record for the world's tallest building. Saudia Arabia has now building the Jeddah Tower with the height 3,280 feet into the sky, compared to Burj Khalifa's 2,722 feet.