123456.. వరస్ట్ పాస్‌వర్డ్‌..!

Worst Password Of The Year 2015

11:22 AM ON 22nd January, 2016 By Mirchi Vilas

Worst Password Of The Year 2015

ఈమెయిల్స్‌, బ్యాంక్‌ అకౌంట్స్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌.. అన్నింటిలోనూ మనకు వ్యక్తిగత ఖాతాలుంటాయి కదా. అందులోని సమాచారాన్ని భద్రంగా ఉంచేందుకు వాటికి పాస్‌వర్డ్‌ పెట్టుకుంటాం కదా. అయితే ఇలాంటి వాటికి ఎక్కువ మంది వాడుతున్న పాస్ వర్డ్ ఏమిటో తెలుసా..!! 123456.. ఈ నంబర్లనే ఎక్కువ మంది పాస్ వర్డ్ గా వాడుతున్నారట. సులువుగా గుర్తుంటుందనో ఏమో గానీ.. చాలా మంది ఇలాంటి సాధారణ పాస్‌వర్డ్‌లనే పెట్టుకుంటున్నారట. అలా 123456ని ఎక్కువ మంది పాస్‌వర్డ్‌గా పెట్టుకోవడంతో 2015 సంవత్సరానికి ఇదే చెత్త పాస్‌వర్డ్‌గా నిలిచింది. 2014లోనూ ఇదే చెత్త పాస్‌వర్డ్‌గా ఎంపికవడం గమనార్హం. బలహీనమైన పాస్‌వర్డ్‌లపై అవగాహన కల్పించేందుకు స్పాష్ డేటా సాఫ్ట్‌వేర్‌ అనే సంస్థ ఏటా వరస్ట్‌ పాస్‌వర్డ్‌ పేరుతో జాబితా విడుదల చేస్తుంది. 2015కుగానూ 25 పదాలతో జాబితాను విడుదల చేయగా.. 123456 మొదటి స్థానంలో నిలిచింది. password అనే పదం ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. 2014లోనూ ఈ పదం ఇదే స్థానంలో నిలిచింది. 12345678, qwerty, 12345 తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇలాంటి పాస్‌వర్డ్‌ల ద్వారా భద్రతా పరమైన సమస్యలు
ఎదురవుతాయని..వేరే వ్యక్తులు సులువుగా వీటిని గుర్తించి.. వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకునే అవకాశముందని సంస్థ తెలిపింది. పాస్‌వర్డ్‌ల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని.. అనేక ఖాతాలు ఉన్నప్పుడు ఒక్కో వెబ్‌సైట్‌కు వేర్వేరు పాస్‌వర్డ్‌లు ఉపయోగించడం మంచిదని పేర్కొంది.

English summary

According to a Survey the worst password in the world of the year 2015 was "123456". And QWERTY and 12345 were in next positions to that password