చిరు సినిమా స్టోరీ నాదేనంటున్న రైటర్

Writer demands Chiranjeevi and Vinayak

09:57 AM ON 2nd May, 2016 By Mirchi Vilas

Writer demands Chiranjeevi and Vinayak

ఈ మధ్య ఎవరో రాసిన స్టోరీని రైటరుకి తెలీకుండా సినిమా తీసెయ్యడం, ఆ తర్వాత గొడవ, రగడ చోటు చేసుకోవడం, కోర్టు దాకా ఆ వ్యవాహారం వెళ్ళడం, ఆ తర్వాత మేటర్ సెటిల్ చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవికి ఆ ఇబ్బంది తప్పేట్టు లేదు. చిరు 150వ చిత్రం కత్తిలాంటోడికి బాలారిష్టాలు ఉన్నాయని అనిపిస్తోంది. ఈ సినిమా కథ తనదేనని, క్రెడిట్ తనకే దక్కాలని తెలుగు రైటర్ నరసింహా రావు డిమాండ్ చేస్తున్నారు. ఈ మూవీ దర్శకుడైన వివి వినాయక్ తనను పిలిచి నీకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని ఆయన అంటున్నాడు. టైటిల్స్ లో తన పేరు ఉండాల్సిందేనని ఆయన కోరుతున్నట్టు తెలిసింది.

నాకు పారితోషికం అవసరమే, అయితే ఎంత ఇవ్వాలన్న దాని పై డిమాండ్ చేయడం లేదు.. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను అడ్డుకోవాలన్న ఉద్దేశం లేదు.. చిరంజీవి-వినాయక్ నాకు ఎలా న్యాయం చేస్తారన్న దాన్ని బట్టి ఏం చేయాలన్నది నిర్ణయించుకుంటా అని నరసింహా రావు అంటున్నట్టు సమాచారం. కత్తి మూవీ స్టోరీ తనదేనని ఈయన ఆ మధ్య తెలుగు కథా రచయితల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం విదితమే. తమిళ ఒరిజినల్ కత్తిలో నటించిన హీరో విజయ్ కి కూడా గతంలో ఈ రచయిత తన వాదన వినిపించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. మొత్తానికి ఆదిలోనే ఇబ్బంది తలెత్తింది.

English summary

Writer demands Chiranjeevi and Vinayak. Chiranjeevi. Writer Narasimha Rao demands that Chiranjeevi 150th movie story is mine.