రిలయన్స్‌ వరకు ఎదిగిన కోనవెంకట్‌!!

Writer Kona Venkat get big offer from Reliance productions

01:43 PM ON 1st December, 2015 By Mirchi Vilas

Writer Kona Venkat get big offer from Reliance productions

రచయితగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కోనవెంకట్‌ అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు. శంకరాభరణం చిత్రానికి నిర్మాతగా వ్యవహరించి ఆ సినిమాకు సంబంధించిన అన్ని పనులు దగ్గర ఉండి చూసుకోవడమే కాకుండా ఆ సినిమా రిజల్ట్‌ కూడా ముందే చెప్పేస్తున్నాడు. డిసెంబర్‌ 4న విడుదలవుతున్న శంకరాభరణం చిత్రం రూ.40 కోట్లు వసూలు చేసుకోగల సత్తా ఉందని చాలా స్ట్రాంగ్‌గా చెపుతున్నాడు. ఈ రచయిత భాగస్వామ్యం కోసం బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ రిలయన్స్‌ వెంటబడుతుంది. అయితే ఈ డీల్‌ ఇంకా ఫైనల్‌ కావల్సి ఉంది. ఎందుకంటే 2016 సంవత్సరంలో మూడు సినిమాలు నిర్మించే పనిలో కోన ఉన్నాడు.

వీటితో పాటు అతిలోక సుందరి శ్రీదేవి కోసం కూడా ఒక కథని అందిస్తున్నాడు. ఇవి కాకుండా రిలయన్స్‌ నుండి ఒక భారీ ఆఫర్‌ వచ్చింది. ఈ ఆఫర్‌ ఏంటంటే కోన ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన పనేలేదట మొత్తం రిలయన్స్‌ ఖర్చు చేస్తుందట. కోన తన క్రియేటివిటీతో ఈ సంస్థ నిర్మించే చిత్రాలన్నింటికీ కోన డైరెక్షన్‌ చేస్తే చాలట. కానీ స్టార్స్‌తో మాత్రం చెయ్యను అన్నీ చిన్న హీరోలతోనే చేస్తానని ట్విస్ట్‌ ఇచ్చాడు కోన.

English summary

Writer Kona Venkat get big offer from Reliance productions for directing 3 movies under his creativity.