జక్కన్న తండ్రితో అజయ్ దేవగన్

Writer Vijayendra Prasad directing Ajay Devgan

10:24 AM ON 11th July, 2016 By Mirchi Vilas

Writer Vijayendra Prasad directing Ajay Devgan

సక్సెస్ సినిమాల స్టోరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ హవా బాలీవుడ్ లో కూడా కొనసాగుతోంది. అనిల్ కపూర్ హీరోగా 2001లో శంకర్ తెరకెక్కించిన బాలీవుడ్ మూవీ 'నాయక్'(తెలుగులో ఒకే ఒక్కడు) సినిమా సీక్వెల్ కి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అజయ్ దేవగన్ హీరోగా తెరకెక్కబోతోన్న మరో బాలీవుడ్ మూవీకి కూడా విజయేంద్రప్రసాద్ కథ అందిస్తున్నారని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఇక విజయేంద్ర ప్రసాద్ ఎవరంటే దర్శక దిగ్గజం రాజమౌళికి తండ్రి. వివాదాస్పదమైన బాబ్రీ మసీదు ఇతివృత్తంతో కబీర్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కించనున్నట్లు చెబుతున్నారు.

ఈ మూవీలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్నాడు. సెన్సార్ బోర్డు చీఫ్ పహ్లాజ్ నిహ్లాని ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఆరునెలల ముందే ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పటికీ, వివాదస్పదమైన ఈ సినిమా కథా చర్చలు ఇప్పటికీ ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్తుందంటున్నారు. ఇంతకీ విషయం ఏమంటే, ఈ సినిమాకు కథా రచయిత విజయేంద్రప్రసాదే దర్శకత్వం వహిస్తారని టాక్.

English summary

Writer Vijayendra Prasad directing Ajay Devgan