వివాదస్పదమైన ఎక్స్‌మెన్‌ ట్రైలర్‌

X-men controversial trailer

11:54 AM ON 17th December, 2015 By Mirchi Vilas

X-men controversial trailer

ఇటీవల విడుదలైన హాలీవుడ్‌ చిత్రం ఎక్స్‌మెన్‌ ట్రైలర్‌ వివాదస్పదమైంది. ఆ ట్రైలర్‌ లో నీలం రంగులో కనిపిస్తున్న విలన్‌ “I have been called many things over many lifetimes — Ra, Krishna, Yahweh.” అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి.

నెవిడాకు చెందిన రాజన్‌ జెడ్‌ అనే హిందుమత పెద్ద ఆ వ్యాఖ్యలను ఖండించాడు. ఆ ట్రైలర్‌ లో హిందు దేవుడు శ్రీకృష్ణ భగవానుని నీలిరంగు విలన్‌ అపోకాలప్స్‌ తో పోల్చడం పట్ల ఆయన తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసారు. హిందువులు నిరంతరం పూజించే శ్రీకృష్ణుడుని అలా పోల్చడం సరికాదని అ న్నారు.

ఎక్స్‌మెన్‌ సిరిస్‌ లో వచ్చిన సినిమాలు ఎంతటి సూపర్‌హిట్‌ సాధించాయో తెలిసింది. ఈ కొత్త ఎక్స్‌మెన్‌-అపోకాలప్స్‌ సినిమా వచ్చే సంవత్సరం 2016 మే లో విడుదల కానుంది.

సినిమా విడుదల కాకముందే ఇంత వివాదం సృష్టించిందంటే, విడుదల అయ్యాక ఇంకెన్ని వివాదాలకు కారణమవుతుందో వేచి చూడాలి.

English summary

Recently 20th Century Fox films had released the trailer for X-Men: Apocalypse which introduces a blue-skinned super-villain, Apocalypse. In that the villian was compared with Lord Krishna. The hindu preist Rajan Zed opposed that comparision with hindu God Lord Krishna